Thursday, November 15, 2007

పెళ్ళి

ఏంటో కాని ఈ మధ్య నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా నాకు పెళ్ళి సంబంధాలు చూస్తామని తెగ ఉత్సాహపడుతున్నారు.వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనాలని "సరే,చూసుకోండి" అని చెప్పాను.హేమ అయితే మరీను,ఆఫీస్ అవర్స్ లో ఫోన్ చేసి మా ఆయన ఫ్రెండు ఒకతను ఉన్నాడు,బాగ సెటిల్ అయ్యాడు,"ఆండాళ్ సాఫ్ట్ వేర్ సొల్యుషన్స్" లో ఆవకాయ ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ మేనేజర్,"చేసుకుంటావా?" అని అడిగింది.నాకు భలే నవ్వొచ్చింది.చేసుకుంటావా అని అడిగితే నా మొహం అప్పటికప్పుడు నేనేమి సమాధానం చెప్తాను.అసలు జనాలకి నాకు పెళ్ళి చెయ్యాలనే ఆలోచన ఇప్పుడొచ్చింది కాని నేను మాత్రం ఒకటో తరగతిలో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకుందామనుకున్నాను.

నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మా చిన్నపిన్ని పెళ్ళయ్యింది.అప్పుడు తను డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుండేది.పెళ్ళయిన తరవాత చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసింది.'ఓహొ,పెళ్ళి చేసుకుంటే చదువుకోనవసరం లేదు' అని అర్ధమయ్యింది నాకు.వెంటనే అమ్మదగ్గరికెళ్ళి "అమ్మా,నేను పెళ్ళి చేసుకుంటాను" అని చెప్పాను.అంతే అందరు పగలబడి నవ్వారు.ఇందులో నవ్వడానికి ఏముంది అని అనుకున్నాను.ఏంటో నేను ఇంత సీరియస్ గా చెప్తున్నాకాని ఎవ్వరు పట్టించుకోరేం? తరవాత కొన్నాళ్ళకి నేను టీవిలో "సోగ్గాడు" సినిమా చూసాను.సినిమాలో శోభన్ బాబుని చూసి ఉక్కిరిబిక్కిరైపోయి మనసు పారేసుకున్నాను."అమ్మా నేను శోభన్ బాబుని పెళ్ళిచేసుకుంటాను" అని చెప్పాను.ఇదివరకు పెళ్ళి చేసుకుంటానని చెప్పాను,ఇప్పుడు ఎవర్ని చేసుకుంటానో కూడ చెప్పాను.అబ్బ! ఎంత డెవలప్ మెంటు!!కాని నన్నెవ్వరు సీరియస్ గా తీసుకోలేదు.నేను మాత్రం డిసైడైపోయాను.పెళ్ళంటు చేసుకుంటే శోభన్ బాబునే చేసుకోవాలని.ఎప్పుడు టీవిలో శోభన్ బాబు సినిమా వచ్చినా కాని నోరు వెళ్ళబెట్టుకోని చూసేదాన్ని.అసలు ఇప్పటివరకు శోభన్ బాబు అంత handsome గా ఉన్నవాళ్ళని నేను చూడలేదు.ఇంక గాగుల్స్ పెట్టుకోని పాటల్లో డాన్స్ వేస్తుంటే..ఆహా! చూడాల్సిందేకాని చెప్పడానికి మాటలు సరిపోవు.నేను హీరోయిన్ మొహం ప్లేస్ లో నా మొహం అతికించుకొని చుసేదాన్ని సినిమాలన్ని.

ఒకసారి మా అమ్మ "శోభన్ బాబుకి పెళ్ళయిపోయింది" అని చెప్పింది.ఆ భయంకరమైన నిజాన్ని విని నేను తట్టుకోలేకపోయాను.చాలా బాధపడ్డాను.నా ప్రోగ్రెస్ కార్డ్ చూసుకొని కూడ నేను ఎప్పుడు అంత బాధపడలేదు.తరవాత నేను మా అమ్మ మీద చాలా పోట్లాడాను నన్ను ఇంకా ముందే ఎందుకు పుట్టించుకోలేదని.అసలు ఈ విషయంలో నాకు చాలా అన్యాయం జరిగింది.దేవుడా,వచ్చే జన్మలోనైనా నన్ను,శోభన్ బాబుని ఒకే జనరేషన్ లో పుట్టించి మా ఇద్దరికి పెళ్ళి జరిపించు.

17 comments:

kalpana said...

ni lanti gayyali gampaki shobanbabu lanti opikastule correct.

kalpana said...

shobanbabu ki rendo pelli chesukovadam alavate...try cheddamaa??

Ramani Rao said...

పాపం వదిలేయడి క్రాంతి/ కల్పనగారు శోభన్ బాబుని.. అన్ని సినిమాల్లో ఇద్దరితో కష్టపడ్డాడు.... ఇక నిజ జీవితంలో కూడా అంటే..??అయినా క్రాంతిగారు మీరు చాల చిన్నవారు కదా.. ష్..ష్... మనలో మనమాట శోభన్ బాబుకి ఎవరన్నా కొడుకులున్నారేమో చూడండి....అచ్చు శోభన్ బాబులా వుంటారేమో..శోభన్ బాబు లాంటి అందగాడు కావాలనుకొన్నారు కాని... శోభన్ బాబు ని కాదు కదా.."ఫలనా.. "లాంటి" వారము" అని చెప్పుకొని చాల మంది సంతృప్తి పడిపోతువుంటారు ....బెస్ట్ ఆఫ్ లక్... అలా అని అన్నయ్య "లాంటి" వారము.. తమ్ముడి "లాంటి" వారము అనే వాళ్ళ జోలికి వెళ్ళకండి.. ఇ"లాంటి" వాళ్ళతో మన తలకి బొప్పే...

kiraN said...

నాకు శోభన్ బాబు చాలా బాగా తెలసు
ఏమైనా సాయం కావాలంటే అడగండి :)

ఇంతకీ ఆవకాయ సంబంధం ఏమైంది?

- కిరణ్

VJ said...

ఇంత వరకు అన్నయ్యలు, తమ్ముళ్ళు మాత్రమే ఇలాంటి బ్లాగులు రాసేవారు. ఇప్పుడు మీరు కూడ రాయడం బాగుంది, ఆపొద్దు.. రాస్తూ ఉండండి.

krishna said...

just hillarious.

వికటకవి said...

పోయి పోయి శోభన్ బాబుని కోరుకున్నారేమిటో! సవతి గోల అంటే ఇష్టమా ఏమిటీ మీకు? :-)

http://sreenyvas.wordpress.com

విహారి(KBL) said...

comedy adirindi.

విశ్వనాధ్ said...

శోభన్ బాగా సంపాదిస్తున్నాడు రియల్ ఎస్టేట్ బిగినిస్సులో.
పాత సినిమాల్లోలా అరటిపండు తొక్కతో మొదటి పెళ్ళాం నడ్డి విరిచేసి మంచం పాల్జేసేసి తాళం గుత్తి లాగేసుకొనే లాంటి 'తొక్క' అవిడియాలు కావాలంటే తప్పకుండా నన్ను సంప్రదించండి.

Solarflare said...

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని... అలా, మీ "డెవెలెప్-మెంట్" పాపమర్ధంచెసుకోకుండా మిమ్మల్ని ఎన్ని కష్టాలలోకి నెట్టేసారండి!

బ్లాగేశ్వరుడు said...

మొదటి సగం 10/10, రెండవ సగం మరియు క్లైమాక్స్ 5-6/10

Anonymous said...

8.5/10

Satish Bolla said...

భలే అందంగా, అమాయకంగా రాసారు. ఇంతకీ మీకు పెళ్ళయ్యిందా?

Shankar Reddy said...

ఈ రొజే మీ ఈ టప చదివాను.......బాగు౦ది....

శోభన్ బాబు ఈ రొజే చనిపోయారు.....
http://www.eenadu.net/breakhtml3.asp

Ahamed said...

hi urs blog is so nice and attractive

Kathi Mahesh Kumar said...

చాలా బాగుంది.
www.parnashaala.blogspot.com

andhrajyothi said...

mee *pelli, talanoppa- 25.11.12 aadivaaram aandhrajyothi sanchikalo prachuristhunnamu.
-editor, andhrajyothi