Saturday, August 30, 2008

ముంబై మేరి జాన్

మాములుగా నేను ఏదయినా సినిమాకెళ్ళాలంటే ఒక పది రివ్యూలు చదివి, ఆఫీస్ లో పదిమందిని వాళ్ళ అభిప్రాయాల్ని కనుక్కొని మరి చూస్తాను.అలాంటి నేను ఈ సినిమాకి ఎలాంటి రివ్యూస్ చదవకుండా,ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను.అందుకే కాబోలు నేను మొదటిసారిగా ఒక సినిమాకి రివ్యూ రాస్తున్నాను.2006 జూలై 11వ తారిఖున ముంబైలోని ఒక లోకల్ ట్రైన్ లో జరిగిన పేలుళ్ళు ఇతివృత్తంగా సాగుతుంది ఈ సినిమా.అయిదుగురు సాధారణ వ్యక్తుల జీవితాల్లో ఈపేలుళ్ళు ఎలాంటి మార్పుల్ని తెచ్చాయి అన్నది కథాంశం.ప్రతి సంఘటనని కమర్షియలైజ్ చేసి రేటింగ్స్ పెంచుకోవాలని తాపత్రయపడే న్యూస్ ఛానల్స్ ని,అమెరికాలోనో,UK లోనో సెటిల్ అయితే ఇక భవిష్యత్తుకి ఢోకా ఉండదన్న భావనలో ఉన్న నేటి యువతరాన్ని చక్కగా ఆవిష్కరించారు ఈ సినిమాలో.

స్వతహగా పరేష్ రావల్ అభిమానినయిన నేను ఈ సినిమాలో ఆయన నటనకి మరొక్కసారి జై కొడుతున్నాను.ఒకరకంగా ఈ సినిమాకి ఆయన హీరో అని చెప్పవచ్చు.రిటైర్ మెంటుకి చేరువలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ తన ముప్పయ్ అయిదు సంవత్సరాల సర్వీసులో డిపార్ట్ మెంటులోని అధికారుల అలసత్వాన్ని,లంచగొండితనాన్ని ప్రశ్నించలేక తనకు తానుగా అసమర్ధునిగా,లంచగొండిగా మారి మధనపడే పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు.ఆవేశపరుడైన కానిస్టేబుల్ పాత్రలో విజయ్ మౌర్య కూడా బాగ నటించారు.మరొక ముఖ్యమయిన పాత్రని ఇర్ఫాన్ ఖాన్ పోషించారు.సైకిల్ మీద టీ అమ్ముకునే చిరువ్యాపారి పాత్రలో ఆయన కనిపిస్తారు.తమిళ క్రిస్టియన్ అయిన ఈ పాత్ర(ఈపాత్రని తమిళయన్ గా ఎందుకు చూపించారో నాకయితే అర్ధం కాలేదు.పైగా ఇర్ఫాన్ ఖాన్ తమిళియన్ గా అస్సలు సూట్ అవ్వలేదు :)) ఒక సందర్భంలో షాపింగ్ మాల్ లో తనకి జరిగిన అవమానం వల్ల మొత్తం డబ్బున్న వాళ్ళంటేనే ద్వేషం పెంచుకుంటాడు.తనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా కాయిన్ బాక్స్ ఫోన్ ద్వార పోలిసులకి షాపింగ్ మాల్ లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారాన్ని అందించి,తరవాత జరిగే గలాటాని చూసి సాడిస్టిక్ ఆనందాన్ని పొందుతాడు.క్రమంగా అది అతనికొక అలవాటుగా మారి రోజుకొక మాల్ లో బాంబు ఉందని పోలిసులకి ఫోన్ చెయ్యటం తరవాత జరిగే తమాషాని ఎంజాయ్ చెయ్యడం మాములైపోతుంది.తరవాత ఈ పాత్రలో మార్పు తెచ్చిన తీరు చాలా బాగుంది.

ప్రతి ముస్లిమ్ తీవ్రవాదే అని వితండవాదం చేసే హిందు నిరుద్యోగి పాత్రలో K.K.మీనన్ ఎప్పటిలాగానే బాగా నటించారు.మాధవన్ ఒక యువ ఉద్యోగిగా,సోహా అలీఖాన్ న్యూస్ రిపోర్టర్ గా కనిపించారు.మెదటిసారి సోహా ఈ సినిమాలో నటించడానికి ప్రయత్నించింది :)!!!! మొదటిసినిమా అయినప్పటికి ఎక్కడా సాగదీయకుండా,బోర్ కొట్టించకుండా చక్కగా తీసారు దర్శకుడు నిశికాంత్ కామత్.

ఏ దిల్ హై ముషికిల్ జీనా యహా
జర హట్ కె జర బచ్ కె,
యేహే ముంబై మేరి జాన్!!!!...
అంటు ముగుస్తుంది ఈ సినిమా.

7 comments:

Rajendra Devarapalli said...

బాగుందండి మీ సమీక్ష,ముందు ముందు మరిన్ని సమీక్షలు మీరు రాయాలి:)

Purnima said...

Nice review.

Unknown said...

ఇంకే! నవతరంగంలో రాయడం మొదలెట్టచ్చు మీరు :)

ఈ సినిమా పేరే వినలేదే నేను... మ్.
సమీక్ష చదువుతుంటే బానే ఉందనిపిస్తుంది.

Kathi Mahesh Kumar said...

నిన్న రాత్రే ఈ సినిమా ఐమాక్స్ లో చూసాను.ఈ దర్శకుడి మొదటి సినిమా ‘డోమివెల్లి ఫాస్ట్’(మరాఠీ) కూడా చాలా మంచి చిత్రం.మరిన్ని అర్థవంతమైన చిత్రాలు నిశికాంత్ కామత్ నుంచీ మనం ఆశించవచ్చు.

ఈ సమీక్షని నవతరంగంకి పంపెయ్యండి మంచి ప్రారంభం అవుతుంది.

Unknown said...

review ami rasaru,chandalnga vundi

cbrao said...

మీ తదుపరి సమీక్ష నవతరంగం లో చూడొచ్చనేలా, మట్లాడుతున్నట్లుగా, భెషజాలు లేకుండా సింపుల్ గా బాగుంది.

క్రాంతి said...

అందరికి థాంక్స్ అండి.ఈసారి నుండి నవతరంగంలో రాసేంత శాస్త్రీయంగా రాయడానికి కృషి చేస్తా.