Tuesday, July 24, 2007

కాఫీ టేబుల్

నిన్న సాయంత్రం,టైం చూస్తే 5.40 అయింది.అబ్బా ఇంకా అరగంట యాక్షన్ చెయ్యాలి అని అనుకుంటున్నాను.ఇంతలో మా టీమ్ అంతా కలసి కాఫీహాల్ కి వెళ్ళాలని డిసైడ్ చేసారు.మనకి కావల్సింది కుడా అదే కదా! రెండు నిమిషాల్లో అందరం కాఫీ హాల్లో ప్రత్యక్షమయ్యాము.(అదే స్టేటస్ మీటింగ్ అంటే మాత్రం ఒక్కరు కూడ టైంకి రారు) రెండు టేబుల్స్ ని కలిపి ఒక సర్కిల్ లాగా కూర్చున్నాము.ఒకసారి మా గ్రూప్ మేనేజర్ వచ్చి "మీరు బాగుపడరు" అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు.ఇలాంటివన్ని మనమెప్పుడు పట్టించుకున్నాము కాబట్టి.ఏదో ఇంటర్మీడియట్లో,ఇంజనీరింగులో చేరిన కొత్తలో కాస్త రోషం,పౌరుషం ఉండేవి.తరవాత తరవాత నెమ్మదిగా నేను కూడ జనజీవన స్రవంతిలో కలసిపోయా.

కాసేపు ప్రాజెక్ట్, న్యూ రిలీజ్, బగ్ ఫిక్సింగ్ ల గురించి మాట్లాడాక,"వారానికి ఆరు పనిదినాలు" గురించి చర్చ జరిగింది.విప్రో వాళ్ళకి ఇ-మెయిల్ కుడా వచ్చేసిందంట!! ఎప్పట్నుంచి అమలుచేస్తారో మాత్రం ఇంకా తెలియదు.సడన్ గా శరవనన్ కి YSR - చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు.వాళ్ళిద్దరు ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి అనుకొని టీవీల్లోకి ఎక్కి జనాల్ని హింసిస్తారుఅని అడిగాడు.మరి టీమ్ లో నేను ఒక్కదాన్నే తెలుగు కాబట్టి నేనే సమాధానం చెప్పాలన్నట్లు అందరు నన్నే చూసారు."వాళ్ళిద్దరు అందరి ముందు తన్నుకుంటారు,సింగపూర్ లో మాత్రం కలసి రెస్టారెంటు బిజినెస్ చేస్తారు." అని చెప్పాను.బిజినెస్ సంగతి నాకు మా ఫ్రెండు ఎవరో చెప్పారు.అది ఎంతవరకు నిజం అనేది మాత్రం నాకు తెలియదు.

ఇక మా కబుర్లు జోరందుకున్నాయి.ఈ మధ్యే మాటీమ్ మేట్ అర్షద్ కి పెళ్ళి సెటిల్ అయ్యింది.ఇంకేం,ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఎవరు సరిగ్గా సూట్ అవుతారో చాలా రీసెర్చి చేసాడు.ఈ మొత్తం రీసెర్చిలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దొరికింది.డాక్టర్లు ఎప్పుడు తమని తాము ప్రపంచానికి రెండు ఇంచుల పైన ఊహించుకుంటారంట,మరి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమని తాము రెండు ఇంచుల కింద ఊహించుకుంటారంట.ఇక ఈ నాలుగు ఇంచుల తేడాతో వాళ్ళకి పెళ్ళి చేస్తే ఆ ఇల్లు నరకమేనంట! నాకు కూడ ఇది కొంతవరకు నిజమేననిపించింది.ఎందుకంటే నాకు కూడ ఇద్దరు ముగ్గురు డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు.వాళ్ళెవ్వరికి కూడ కళ్ళు ఉండాల్సిన స్థానంలో ఉండవు.(నా మాటలు ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలి)

తరవాత స్ట్రెస్ ని ఎలా అధిగమించాలి అనే విషయంపై లెక్చర్ ఇచ్చి మమ్మల్ని enlight చేసాడు అర్షద్.మనసు బాగోలేనప్పుడు రుచికరమయిన భోజనం తయారు చేసి,ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి ఇంటికి పిలిచి భోజనం పెట్టాలంట.భోజనాలయ్యాక నార్త్ ఇండియన్స్ అయితే గోవిందా సినిమా,తమిళియన్స్ అయితే విజయకాంత్ సినిమా,మనమయితే బాలక్రిష్ణ సినిమా చూడలంటా.సైకాలజి ప్రకారం..పెద్ద కష్టం వచ్చినప్పుడు చిన్న కష్టాల్ని తొందరగా మర్చిపోతారంట.కాబట్టి ఆయా హీరోల సినిమాలు చూసి మనం మన కష్టాల్ని మర్చిపోతామన్నమాట.కాకపోతే ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరి.ఎట్టి పరిస్థితుల్లో కూడ ఈ హీరోల సినిమాలు ఒంటరిగా చూడకూడదు.12 సంవత్సరాలలోపు పిల్లలు ఇలాంటి సినిమాలు చూడకుండా జాగ్రత్తపడాలి.

హా..ఆరు గంటలయ్యింది.ఇంక నాన్ స్టాప్ యాక్షన్ కట్టిపెట్టి అందరం ఎవరి ఇళ్ళకి వాళ్ళం బయలుదేరాము.మొత్తానికి "A lot can happen over coffee" అనేదానికి 100% న్యాయం చేసి ఈ ఎపిసోడ్ ని ముగించాము.

10 comments:

Kolluri Soma Sankar said...

సరదాగా ఉంది మీ ఆఖ్యానం
సోమ శంకర్
www.kollurisomasankar.blogspot.com
www.kollurisomasanakr.wordpress.com

kalpana said...

5:40 ayyaka coffee ki vellara??

memu ayite 5:00 ki velli, tarvata vachi oka 30 min laptop sardukuntamu...itte time ayipotundi. mari pani unnappudu 9:00 PM varaku untam kada.

Ala podupuga time waste cheyyaku..time pass cheste nalaga dil khol ke waste cheyyali.

sare kani ni narration improve ayyinattu anipistundi...mari ee anandamlo 2 inches piki vellochu kada.

Anonymous said...

manchi Taeking vundi mee Tapaaloe.

saradaaga vundi. sTress rileef kooDaa baavundi.

-- vihaari

రాధిక said...

"తరవాత నెమ్మదిగా నేను కూడ జనజీవన స్రవంతిలో కలసిపోయా".
caalaa baagaa raasaaru

Niranjan Pulipati said...

సరదాగా బాగా రాశారు.. అయినా 6.15 కి ఆఫీసు నుండి బయలుదేరితే ఆ బెంగళూరు ట్రాఫిక్ అనే నరక కూపం నుండి బయట పడేదెప్పుడో ? :)

Naga said...

ఎంతో ఆసక్తికరంగా రాసారు. బాగుంది.

మేధ said...

మా ఆఫీస్ లో ఐతే, 5:00 వరకు ఉంటే చాలు.. (మార్నింగ్ తొందరగా రావాలి అనుకోండి 8:00 కి) లేటు గా వస్తే, లేట్ గా బయలుదేరాలి.. ఈ ట్రాఫిక్ బారి నుండి బయటపడాలి అనుకుంటే, తొందరగా బయలుదేరాల్సిందే..
సరదా సరదాగా సాగిపోయింది మీ లేఖ.. మేము చేసుకునే, కాఫీ చర్చలు గుర్తుకు వచ్చాయి.. :)

విహారి(KBL) said...

శ్రావణపూర్ణిమ(రాఖీ) శుభాకాంక్షలు.

విహారి(KBL) said...

మీకు శ్రీక్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

క్రాంతి said...

హా..తూచ్..శ్రీక్రిష్ణాష్టమి ఏరోజున వచ్చింది?ఈ మధ్య అసలు నాకు ఏమి తెలియకుండా పోతుంది.