Sunday, January 27, 2008

తలనొప్పా!

..అయితే జండు బామ్ రాసుకోండి అనే యాడ్ టీవిలో చూసినప్పుడల్లా నా కడుపు రగిలిపోతుంది.అసలు వీళ్ళు చెప్పేవన్ని అబద్దాలే.తలనొప్పి చిటికెలో తగ్గిపోతుంది అని చెప్పాడు టీవిలో.ఏది?నేను పదిసార్లు చిటికె వేసినా తగ్గలేదు సరికదా,చిటికెలు వేసి వేసి నాకు చెయ్యి నొప్పి కూడ వచ్చింది.

అదొక కాళసాయంత్రం.(కాళరాత్రి టైపులో అన్నమాట)ఆఫీసు నుండి హాస్టల్ కి వచ్చేసరికి రూమ్ లో ఎవ్వరు లేరు.ద్రాక్షయణి అంతకు పదిరోజుల ముందే కెనడా వెళ్ళింది.దీప్తి సేలం వెళ్ళింది.నాకేంటో విపరీతంగా తలనొప్పి.చిన్నప్పట్నుంచి కూడ నాకెప్పుడు నిజంగా తలనొప్పి రాలేదు.ఉత్తుత్తినే అబద్దంగా మాత్రం చాలాసార్లు వచ్చింది.హాస్టల్ కి రాగానే మంచం మీద వాలిపోయాను.వెంటనే నిద్ర పట్టేసింది.రాత్రి ఎనిమిది గంటలప్పుడు నాన్న ఫోన్ చేసారు.ఏమి మాట్లాడానో కూడ గుర్తులేదు నాకు.ఆకలేస్తుంది.అన్నం తిందామని మంచం మీద నుండి లేచాను.అంతే,తల మీద ఎవరో క్రికెట్ బ్యాట్ తీసుకొని కొట్టినట్టు నొప్పి.అంతే కదలకుండా కూర్చున్నాను.అమ్మో ఇప్పుడు ఎలా?కొంచెం తల తిప్పినా కాని విపరీతంగా నొప్పి వస్తుంది.ఛీ! నాయాల్ది రూమ్ లో కూడ ఎవ్వరు లేరు.అవసరమైనప్పుడే అందరు మయమవుతారు.అప్పుడు నాకు టక్కున మా నాయనమ్మ గుర్తొచ్చింది.

నా చిన్నప్పుడు మా నాయనమ్మ దగ్గర ఎప్పుడు అమృతాంజనం ఉండేది.ఇప్పుడు మా నాయనమ్మ రేంజ్ పెరిగిపోయింది.ఇప్పుడు జండుబామ్ వాడుతుంది.అసలు అదేమన్నా మాయిశ్చరైజరో,సన్ స్క్రీన్ లోషన్ అనుకుంటుందో నాకు అర్ధం కాదు కాని డబ్బాలు డబ్బాలు రాసుకుంటుంది.ఒకసారి నేను సైకిల్ నేర్చుకుంటు కిందపడ్డాను.మోకాలికి దెబ్బ తగిలి రక్తమొస్తుంటే మా నాయనమ్మ గబగబా వచ్చి మంచినీళ్ళతో దెబ్బని కడిగి దాని మీద అమృతాంజనం రాసింది.అంతే,ఆ దెబ్బకి నాకు మా నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ కూడ కనిపించింది.మా అమ్మ ఏదో అనబోతే,నాయనమ్మ అమ్మని కసురుకుంది."నాకు తెలియదా పిల్లల్ని ఎలా పెంచాలో,ఏమి తెలియకుండానే వాడ్ని ఇంతవాడ్ని చేసానా" అని అమ్మని,నాన్నని కలిపి తిట్టింది.నాయనమ్మకి ఛాన్స్ ఇవ్వాలి కాని అమృతాంజనంతో మాములు నొప్పులేంటి క్యాన్సర్,ఎయిడ్స్ లాంటి రోగాల్ని కూడ తగ్గిస్తుంది.(నాయనమ్మకి క్యాన్సర్ గురించి తెలుసు కాని,ఎయిడ్స్ గురించి తెలుసో లేదో మరి) నాయనమ్మ దృష్టిలో అమృతాంజనం అంటే సర్వరోగనివారిణి అన్నమాట!

సరే,నాయనమ్మ చెప్పింది,ఇంకా టీవిలో కూడ చూపించాడు కదా అని జండుబామ్ రాసుకున్నాను నుదిటి మీద.అబ్బ ఒకటే మంట.లేని భాద తెచ్చిపెట్టుకున్నట్టు అయ్యింది అని మొత్తం తుడిచేసాను.రాత్రి అంతా అలాగే కదలకుండా పడుకున్నాను.కాని నాకెందుకో అదే నాకు ఆఖరిరోజు అనిపించింది.అమ్మో,ఎలా నేను ఇంకా LIC పాలసి కూడ తీసుకోలేదు.అసలు పోయిన శనివారం tax exemption కోసమని LIC పాలసి తీసుకుందామని భవానికి తెలిసిన ఏంజెట్ దగ్గరికి వెళ్ళాము.నేను నాకు ఒక లక్ష రూపాయాలకి జీవన్ ఆనంద్ పాలసీ కావాలని చెప్తే వినిపించుకోకుండా ముప్పై ఏడేళ్ళ రిటైర్ మెంట్ ప్లాన్ వినిపించాడు.ఇప్పట్నుంచి నాకు 58ఏళ్ళు వచ్చేదాక సంవత్సరానికి ముప్పైరెండు వేలు కడితే తరవాత ఎప్పుడో నాకు రెండు కోట్లు ఇస్తాడంట.ఎందుకు నాకు రెండు కోట్లు?ఏం చేసుకోవడానికి?అదికూడ డెబ్బయి ఏళ్ళ తరవాత!డెబ్బయి ఏళ్ళ తరవాత నేను ఏరకంగా చనిపోతే ఎంత డబ్బు వస్తుందో చెప్పి నామీద నాకే విరక్తి తెప్పించాడు.ఈ పాలసి స్పెషల్ ఏంటంటే suicide చేసుకున్నా కూడ డబ్బులిస్తారంట!అసలు డెబ్బయి ఏళ్ళప్పుడు నేను suicide ఎందుకు చేసుకుంటాను? ఏమో నాకు ఇప్పటికి అర్ధం కాలేదు.ఆ ఏజెంట్ ఇచ్చిన షాక్ కి నేను అసలు పాలసీయే తీసుకోలేదు.ఛీఛీ!ఇప్పుడు నాకేమన్నా అయినా కాని ఎవ్వరికి ఉపయోగం లేదు.

ఇంక లాభం లేదు.నాకు ఆఖరి గడియలు వచ్చేసాయి.అయినా కాని మానవ ప్రయత్నంగా BTMలో ఉన్న మా అక్కకి ఫోన్ చేసాను.తెల్లవారు జామున 4గంటలవుతుంది.వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళే సరికి 5.30 అయ్యింది.నేను అస్సలు నడవలేకపోతుంటే వీల్ ఛైర్ లో కూర్చోబెట్టి తీసుకెళ్ళారు.నైట్ షిప్ట్ లో జూనియర్ డాక్టర్ ఉంది నేను వెళ్ళేసరికి.డాక్టర్ కూడ నా అంతే ఉంది.ఈ అమ్మాయా నాకు తలనొప్పి తగ్గించేది అని అనుకున్నాను.బెడ్ మీద పడుకోబెట్టి కడుపులో నొక్కుతుంది.ఆహా!ఈమె కూడ నాలాగే requirements ఒకలాగ ఉంటే implementation ఇంకోలాగ చేస్తుంది అనుకొని,నాకు కడుపునొప్పి కాదు,తలనొప్పి అని చెప్పాను.ఒక నవ్వు నవ్వింది నన్ను చూసి.తరవాత అర్ధం అయ్యింది ఎందుకు నవ్విందో.పది నిమిషాల తేడాతో మూడు ఇంజెక్షన్లు ఇచ్చింది.ఒక గంట తరవాత నాకు చాలావరకు తలనొప్పి తగ్గిపోయింది.అసలు నాకు తలనొప్పి ఎందుకు వచ్చింది అని అడిగాను.బిపి ఎక్కువ ఉంది,అందుకే తలనొప్పి వచ్చింది అని చెప్పింది.అదేంటి? నేను కదా,వేరే వాళ్ళకి బిపి తెప్పించేది,నాకు బిపి వచ్చిందేంటా అని అనుకున్నాను.కాని ఈ తలనొప్పి ఎపిసోడ్ వల్ల నాకొక గొప్ప నిజం తెలిసింది.అన్ని తలనొప్పులు జండుబామ్ రాసుకొని,చిటికె వెయ్యగానే తగ్గవు.మాడు ఇంజెక్షన్లు వేసుకుంటేనే తలనొప్పి తగ్గుతుంది.

20 comments:

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

meeku meere sati roju unna problems ni entha baaga rastharoo...keep it up

teresa said...

చాలా బాగా రాశారు.మీ నాయనమ్మ సంగతి వింటుంటే మా అమ్మమ్మ గుర్తొచ్చింది.రోజూ మధ్యాన్నం నిద్ర ముందు ఈ లేపనం పులుముకునేది. Amrutanjan rocks!
పూసుకునే పని లేదు, నాకా వాసన చూస్తేనె తలనెప్పి ఎగిరిపోతుంది! :)

కొత్త పాళీ said...

This post will be in my all-time top ten list!

Rajendra Devarapalli said...

ఎంత భయంకరమైన తలనొప్పయినా ఇది చదివితే పారిపోవాలి.గతమ్ లో ఒక పని ద్వారా తలనొప్పి తగ్గేది కానీ అది వింటే యాఖ్ అంటారు .

రాధిక said...

టపా అదుర్స్.మీ దెబ్బకి నా తలనొప్పి బెదుర్స్.
కాలికి తగిలిన దెబ్బకి అమృతాంజనం రాయడం....ఇది మాత్రం సూపరు

చేతన_Chetana said...

ma nanamma daggera undedi amrutanjanam.. oka chethilo amrutanjan inko chetilo maadiphala rasam(rasayanam :-)). pillalu evariki emayyina, anjanam puyyi, rasam poyyi.

Unknown said...

హహహ...
మొత్తానికి బెంగుళూరులో బీపీ తెచ్చుకున్నారన్నమాట.

మా నానమ్మ కూడా అంతే రోజంతా జండూబామ్‍ ని పట్టించిందే పట్టించింది. అసలు ఆ ఘుమఘుమలకి లేని తలనొప్పొచ్చేది :)

చేతన గారు,
మీ కామెంటు హహహ...
anjanam puyyi, rasam poyyi అదుర్స్.

వికటకవి said...

హహహ...చిన్నప్పుడు ఎంత విరక్తి పుట్టేదో ఆ జిడ్డు అమృతాంజన్. మా నాయనమ్మ దాన్ని డైల్యుట్ చేయడానికి అందులో కొబ్బరి నూనె కలిపి (తెలిస్తే కంపనీ వాడు పేటెంట్ తీసుకునేవాడేమో) డబ్బాలకి డబ్బాలు రాసుకొనేది. తగ్గినా తగ్గకపోయినా దాని ఘాటువల్ల అది పనిచేస్తోందన్న ఫీలింగ్ వస్తుందెవరికైనా... అది గతం.

ఆ తర్వాత ఆ ఘాటు సరిపోక ఝండూ బాం వచ్చింది, అదీ పవరు తగ్గాక ఇప్పుడు టైగర్ బాం జిందాబాద్.

http://blog.vikatakavi.net

Nagaraju Pappu said...

beautiful. thank you.

క్రాంతి said...

@దీప్తి గారు
ఏదో మీ అభిమానమండి :-)

@ Teresa gaaru
అందరు నాయనమ్మలు/అమ్మమ్మలు ఇంతేనేమో!!

@కొత్తపాళీ గారు

మీ ఆల్ టైమ్ టాప్ టెన్ లో నా టపాకి స్థానం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది.మా ఇంట్లో ఎవ్వరు కూడ నేను బ్లాగ్ రాస్తాను అంటే నమ్మట్లేదు.అందుకే మీరు రాసిన కామెంటుని అందరికి గొప్పగా చూపించుకున్నాను.చాలా థాంక్స్ అండి.

@రాజేంద్ర గారు
పర్వాలేదు చెప్పండి.నాకు తెలుసుకోవాలని ఉంది.

@రాధిక గారు
మీ తలనొప్పిని బెదరగొట్టేసాను చూసారా!

@చేతన గారు
నాకు ఈ మధ్య ఫోటోలు తీయాలనే దుర్భుధ్ధి పుడుతుంది.ఏ కెమేరా కొనాలో చెప్తారా ప్లీజ్...

@ప్రవీణ్ గారు
అవునండి బెంగుళూరు నాకు బిపి తెప్పిస్తుంది.మీరు ఎలా నెట్టుకొస్తున్నారో ఏమో మరి :)

@వికటకవి గారు
ఈ పేటెంట్ అవుడియా ఏదో బాగుందండి.

@నాగరాజు గారు
టపా చదివినందుకు థాంక్స్ అండి.

రమ్య said...

క్రాంతీ
తలకు మోకాలికి అంటే తెలుసు గాని:) ఈ తలనెప్పి కీ పొట్టకి ఏంటీ రిలేషన్!
నేనైతే తల నెప్పి రాకముందే పాలసీ తీసేసుకున్నా :)

Rajendra Devarapalli said...

క్రాంతి,ఎంత తీవ్రమైన తలనొప్పైనా నల్లిని చంపిగాని,నలిపి గాని వాసన చూస్తే(చూడగలిగితే)తగ్గిపోతుంది.

Subba said...

Hi Kranthi Garu,

Chala Chala Baga Rasaru. Nenu eemadhya ne telugu blogs chadavadam modalubettanu. I am remembering my childhood and teenage with some blogs here.

If you want to buy camera, you can check Canon Powershot s5 IS. I am using Canon Powershot S1 IS for last 3 yrs, I am very happy. but it is little bulky...Quality of pictures are very good..

phani.rebba said...

హ్యాట్స్ ఆఫ్, దీనికి తెలుగు పదం దొరకలేదు. మీ బ్లాగు లోని హాస్యం చాలా బాగుంది. నిరతరం ఇలాగే రాయాలని కోరుకుంటూ -- ఫణి

విహారి(KBL) said...

Excellent
Marvellous
No words to express

laddu said...

haha, very good post. maa nanamma undedhi, vikatakavi garu cheppinattu ma nanamma kuda amrutanjanam lo kobbari nune kalipesi prathi roju pattinchedhi. ee nayanammalu ammammalu andharu inthenemo. chala chakkaga undhi mee post.

Ravali Bhogaraju said...

chala baga rasaru..........navvukoleka chachanu.....sorry meee talanoppi naku navulata ga undanukokandi...mee nanamma ni maku kuda parichayam chedduru........!!!

Ravali Bhogaraju said...

abba em rasarandi..........idi chadivithe unna tensions talanoppulu jandu balm vadakundane taggipotaai.......!!1

Unknown said...

soooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooper
అసలు క్రాంతీ గారు చాలా సాఫ్టగా నచ్చించారండీ...
పిల్లలను ఎలా పెంచాలో తెలియాదా కేక

akka said...

avune monna thatha ni choodataniki velthe pannuneppi ani jandubalm notlo rassukuntundi nanamma pch cheppithe vinadu kada