Tuesday, March 18, 2008

బెంగుళూరు

ఉదయం తొమ్మిది గంటలవుతుంది.బస్టాపు అంతా జనాలతో నిండిపోయి ఉంది.జోదా అక్బర్ సినిమాలో యుద్ధం సీన్ లో ఉన్న సైనికుల మొహాల్లో కనిపించిన expression ఇప్పుడు బస్టాపులో ఉన్న జనాల మొహాల్లో కనిపిస్తుంది.అందరు బ్యాగులు,లంచ్ బాక్స్ లు తగిలించుకొని బస్ కనపడితే చాలు దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.తల పైకెత్తి చూసాను.ఎండ నా మొహం మీద ఈడ్చికొట్టింది.అమ్మో ఇదేమి ఎండ!అదే మన హైదరాబాదులో అయితేనా...అనుకొని ,వెంటనే మెహదీపట్నం బస్టాపులో బస్సుకోసం వెయిట్ చేసిన రోజులు గుర్తొచ్చాయి.ఈ బారు నుండి ఆ బారు దాక బస్సులు,జనాలు,ఎండ...నేను ఎక్కాల్సిన 19 నంబర్ బస్సు తప్ప అన్ని బస్సులు వచ్చేవి.ఒకవేళ నేను ఎక్కాల్సిన బస్సు వచ్చినా కాని నిండా జనాలతో వచ్చేది.అదేంటి ఇదే మొదటి స్టాపు కదా,అప్పుడే బస్సు ఎలా నిండిపోయింది? వాళ్ళంతా బస్సు స్టాపులోకి రాక ముందే బస్సుని ఎక్కడ హైజాక్ చేసి ఎక్కేవారో నాకు ఇప్పటికి అర్ధం కాదు.అవన్ని గుర్తొచ్చినప్పుడు బెంగళూరే కాస్త నయమనిపిస్తంది.కనీసం ఎండ తీవ్రతన్నా తక్కువగా ఉంటుంది.బయట ఎండ వాచిపోతుంటే టీవీలో ఆంటీ మాత్రం పగటి వాతావరణం పొడిగాను,ఉష్ణోగ్రత సామాన్య స్థాయిలోనూ ఉంటాయి అని చెప్తుంది.అసలు ఆవిడని ఒకసారి మెహదీపట్నం నుంచి కూకట్ పల్లికి బస్సులో తీసుకెళ్ళాలి,అప్పుడు కాని సామాన్య స్థాయి ఉష్ణోగ్రత అంటే ఏంటో తెలుస్తుంది.

బస్సుల కోసం దేబిరిస్తూ నిల్చున్నప్పుడు ఠీవిగా కారులో వెళ్తున్న వాళ్ళని చూస్తే నామీద నాకే జాలేస్తుంది.అసలు బెంగుళూరులో ఉదయం తొమ్మిది గంటలకి,సాయంత్రం ఆరు గంటలకి రోడ్లపైన కార్లు,ఫుట్ పాత్ ల పైన బైకులు తప్ప ఏమి కనిపించవు.ఫుట్ పాత్ పైన బైకు నడిపేవాడి కాలర్ పట్టుకొని బైక్ ఆపి నువ్వు ఫుట్ పాత్ పైన బండి నడిపితే బస్సుల కోసం నిలబడే మేము ఎక్కడ దేబిరించాలి అని అడగాలనిపిస్తుంది.మరీ ఇంత కష్టపడి బస్సులు ఎక్కే బదులు ఆటోలో వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది కాని ఇదేమన్నా హైదరాబాదా!హైదరాబాదులో అయితే రోడ్డుమీద కాలు పెట్టగానే రయ్యిమని మన మీదకి కనీసం నాలుగు ఆటోలు దూసుకొస్తాయి.పైగా మీటర్ పదిరూపాయలనుండి మొదలవుతుంది."ఆటో కావాలా మేడం" అని అడిగితే చాలు నేను ఆటో ఎక్కేస్తాను.నన్ను ఎవరన్నా మేడం అంటే చాలు నేను వాళ్ళకోసం ఏ పనైయినా చేసేస్తాను.

అదే బెంగుళూరులో అయితే ఆటోవాడ్ని బ్రతిమాలాలి.ఆటోదగ్గరికి వెళ్ళి మెజెస్టిక్ బస్టాండు అని అడిగితే చీదరింపుగా ఒక చూపు చూసి మొహం తిప్పుకుంటాడు."రాను" అని నోటితో ఒక్క మాట చెప్పొచ్చు కదా! ఆమాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేదా నేను? ఒకవేళ మన పంట పండి వాడు వస్తాను అన్నా కాని వెంటనే "సౌ రుపయా" అంటాడు.మెజెస్టిక్ కి సౌ ఎందుకురా అంట్ల వెధవా అని తిట్టుకొని ఎక్కిన ఆటో దిగేసిన సందర్భాలు ఎన్నో!పోని మీటర్ వేసినా కాని,అది పద్నాలుగు రూపాయలతో మొదలవుతుంది.క్షణక్షణానికి అర్ధరూపయి పెరుగుతుంది.మీటర్ తో పాటు మన బిపి కూడ పెరుగుతుంది.తిప్పిన రోడ్డులోనే నాలుగుసార్లు ఆటోని అటూ ఇటూ పరిగెత్తించి మీటర్ తొంభై తొమ్మిది రూపాయల యాభై పైసలు అయినప్పుడు మెజెస్టిక్ బస్టాండు ముందు దించి వంద లాక్కొని వెళ్ళిపోతాడు.

ఈమధ్య నాజీతమంతా ఆటోలకి,షాపింగ్ మాల్స్ లో దిక్కుమాలిన సినిమాలు చూడడానికే సరిపోతుంది.అందుకే నేను ఒట్టుపెట్టుకున్నాను.మళ్ళీ ఆటో ఎక్కితే సునీల్ మీద ఒట్టు అని.సునీల్ అంటే మా మేనేజర్.చాలా గట్టోడు.ఒట్టు పెట్టిన తరవాత కూడ నాలుగైదుసార్లు ఆటో ఎక్కాను నేను.ఇంక సినిమాల విషయానికొస్తే హాల్లో సినిమాలు చూడటం మానేసాను నేను.ఫోరం షాపింగ్ మాల్ ముందు ఫుట్ పాత్ మీద మనకి దొరకని సీడీ అంటూ ఉండదు. ఇంగ్లీషు,హిందీ,తెలుగు,తమిళం...ఆఖరికి స్వాహిలి భాష సినిమా సీడీలు కూడ దొరుకుతాయి వెతకాలే కాని! కాని అప్పుడెప్పుడో మహేష్ బాబు టీవీలో కనిపించి "కిల్ పైరసీ" అని చెప్పాడు.అందుకే నేను దొంగ సీడీలు కొనను.మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే ఉంది.మా టీమ్ లో ఎవరు ఏ సీడీలు కొన్నా కాని,సర్వర్ లో కాపీ చేస్తారు.ప్రతి శుక్రవారం మధ్యాహ్నం నేను సినిమాలన్ని లాప్ టాప్ లో కాపీ చేసుకొని బస్సు ఎక్కి హాస్టల్ కి వెళ్ళి సినిమాలు చూస్తాను.మహేష్ బాబు సీడీలు కొనద్దని చెప్పాడు కాని చూడొద్దని చెప్పలేదు కదా! :-)

31 comments:

BHARAT said...

mahesh babu ala annadaa !!

విజయ క్రాంతి said...

meebaadalu alavunte maa badhalu evariki cheppukovali?
amsterdam lo vunna peruki ...anni cinema kastalu maaku... dutch teledu...so no TV ...dish pettukovali...adi tadisi mopedavuddi...
edo kondaru daya talichi online cinemalu pettabatti memu bathukuthunnam gaani ...lekunte anthe sangathulu ....

transportation chala baguntundi kaani...pakka opposite ...vipareethamga chali...suddenga enda...malli vaana...tarvatha manchu...anni seasons oke roju choodachu ikkada...

ramya said...

బెంగుళూరు సూపర్ గ ఉంది "మేడం" :)
ఇల్లేరమ్మ కథలు రాసిన వారికి మీకు ఏదో రిలేషన్‌ ఉంది! అదేంటో చెప్పండి "మేడం".

రాఘవ said...

గొప్పగా రాసారు మేడం. హైదరాబాదుని బెంగళూరుని పోల్చడం, పైరసీ గురించి చెప్పిన నాల్గు ముక్కలు హైలైట్.

RG said...

Really... బెంగళూరు వచ్చినకొత్తల్లో I really hated it. తర్వాత ఓ సారి చుట్టపుచూపుగా హైదరాబాద్ వెళ్ళినప్పుడుగాని నాకు పోలిక తెలియలేదు. అప్పటిదాకా హైదరాబాద్ relocate కి అవుదాం అని ఒట్టుపెట్టుకున్నవాడిని కాస్తా lite తీస్కుని బెంగళూరులోనే ఉండిపోయాను. హైదరాబాద్ పేరుకి మెట్రో ఐనా Living Standards విషయం లో బెంగళూరు వెయ్యిరెట్లు నయం.

రాధిక said...

super.మీ టపాలన్నింటిలోకీ ఇది బెస్ట్ గా నిలుస్తుంది.చాలా చాలా చాలా చాలా బాగాఆఆఆఅ రాసారు.

రాధిక said...

మనలో మన మాట మహేష్ బాబు ఏమి చెప్పినా నాకూ వినాలనిపిస్తుంది :)

gunturmirchi said...

అబ్బా, మన బెంగలూరు(ఇప్పుడంతా అలాగేగా పిలుస్తున్నారు) ఆటోల గురించి బాగా రాశావమ్మా క్రాంతీ! ఐ ఐ ఎం దగ్గర ఆటో ఎక్కితే, జె పి నగర్ మూడో ఫేజు లోని 'స్టేటో బాంకో ఆఫో మైసూరో' దగ్గరకెళ్ళే సరికల్లా, మీటరు యాభై రూపాయలెలా అవుతుందో కళ్ళు చించుకుని మీటరులో పెట్టి చూసినా అర్ధం కాదు!

9 కోట్ల రూపయలకు ఇంకా ఐ టి వాళ్లకు లెక్క చెప్పలేక అల్లాడుతున్న మహేష్ బాబు చెప్పే నీతులని పట్టించుకుంటమేంటి మనం? లైట్ దీస్కో!

Naveen Garla said...

బెంగళూరు ఆటో వాళ్ళ దగ్గర నెట్ట్టుకు రావాలంటే కొన్ని చిట్కాలు:
* కొంచెం కన్నడ వచ్చుండాలి(ఎల్లి, ఎష్టు, బర్తీరా లాంటివన్న మాట). హిందీలో మాట్లాడితే, వాళ్ళ రేటే సపరేటుగా ఉంటుంది.
* దారి తెలుసుండాలి. ముందు వాడు ఎడమ పక్కనా, కుడి పక్కనా అని అడుగుతారు... ఏమో మీ దయండి, నాకు దారి తెలియదని చెబితే నష్టపోయేది మనమే.
* కిలోమీటరుకి 6 రూపాయలు ఆటోలో. దొంగ మీటర్లున్నప్పుడు ఈ విషయం వాడికి చెబితే సరి. IIM నుంచి మెజెస్టిక్కుకు దాదాపు 10 కి.మి కాబట్టి ఎక్కువంటే 60/70 అవుతుందని చెప్పండి.
* ఆటోవాడితో కబుర్లాడకండి. వాడు అడిగే ప్రశ్నలకు కూడా ముక్తసరిగా సమాధానాలివ్వండి. సామాన్యంగా స్నేహపూర్వకంగా మాట్లాడేవాళ్ళకే ఎక్కువ బ్యాండుపడుతుంది.

(ఇంకొన్ని చిట్కాలు మరెప్పుడైనా)

- నవీన్ గార్ల
( http://gsnaveen.wordpress.com )

సిముర్గ్‌ said...

వావ్ - ఏం రాసారండీ? ఈబ్లాగే మీ మొదటి రచనలంటే నమ్మటం కష్టమే ఎవరికైనా. ఇది స్ప్రైట్ - క్లియర్ అన్నట్టుంటాయి మీ రచనలు. ఇలాగే కొనసాగించండి. మీ అభిమాన సంఘంలో నన్ను కూడా చేర్చుకోండి మేడం..

కొత్త పాళీ said...

మీరు మరిన్ని రాయాలి మేడం!

oremuna said...

ఎంత బాగా వ్రాస్తున్నారండీ!

Unknown said...

బెంగుళూరు ఆటో మీటరు జెట్ స్పీడుతో నడుస్తుంది.
అలుపంటూ లేక పాపం ఓవర్టైము చేస్తుంది మీటరు. అదీ ఎయిర్పోర్టు వంటి ప్రదేశాల నుంచయితే మరీను.

ఇక సినిమాల సంగతి నా కంపెనీలోనూ సేం టు సేం :)
మన సర్వరులు రెండూ ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుండు.

నిషిగంధ said...

:))) చాలా బాగా రాసారండీ.. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చూసిన బెంగుళూరిని మళ్ళీ గుర్తు చేశారు.. అప్పట్లో చల్లగా, హాయిగా, అమాయకంగా ఉండేది ఆ సిటీ!

Niranjan Pulipati said...

బాగా చెప్పారు. ఆ బెంగళూరు ఆటోల గురించి ఎంత చెప్పిన తక్కువే. నా జీతం లో పావు భాగం ఆళ్ళే తినేసారు. ఇంకో పావు ఆ ఫోరం మాల్ లో షాపులు తినేసాయి.. అందుకే ఇహ లాభం లేదని బెంగళూరుకి తాత్కాలికం గా గుడ్ బై చెప్పేసా..

gunturmirchi said...

మా జీవితంలో, జీతంలో, పావుభాగం ఏమి ఖర్మ, సగభాగం ఫోరం మాల్ తినేస్తోంది. మా పాప పుణ్యమా అని, ఆ పర్సెంటేజ్ రోజు రోజుకీ పెరగడమే కాని తగ్గడం లేదు. ఈ బెంగళూరు ఒక తేనె ఊబి లాంటిది. తొందరగా లేవకపోతే, ఇంక లేవలేం. అందుకే మేమూ తిరిగి హైదరాబాదు పోతున్నాం .

విహారి(KBL) said...

Adirindi Madam.
Once again nice post.

Eswar said...

Good narration....

Trivikram Srinivas said...

Hi really appreciate your patience in writing these blogs, i really like this blog

karthik said...

really nice post "madam"
plz continue like this "madam" :)

naa jeetam lo kooda sgam forum ku arpinchukuntanu :(

Laxman said...

Nice Blog

Unknown said...

Kranthi,
Mee blog link Andhrajyothi lo chusi first time chadivaanu. chadavadam modalu petti aapakunda chadivesaanu meeru vraasinavi anni. chala baaga vrasthunnaru.elage konasaginchandi

CheGuevara Prithvi said...

chala baga rasaru kranthi...ilage continue cheyyandi. ide modati sari chuddam meeblog(THANKS to andhrajyothy).

rakee said...

Hi mee blog ni andhrajothi book lo choosi open chesa chala bagundi.memu meelanti Bloggers ki free ga websites create chesi isthunnamu.meeru kooda mee blog ni .(DOT)com ga marchuko vacchu.poorti vivaralaku maa wesite choodandi
http://www.hyperwebenable.com/

Anonymous said...

hi im also visited ur blog after reading from andhra jyothi first of all thanks to jyothi gaaru
and mee bloggggg super gaa vundi ninna madhyaahnam antaa mee blog chaduvutoo vundi poyaanu chaaalaa baagaa raasaru naaaku chaalaa nachhayi nice

Srinivas Sirigina said...

హల్లో క్రాంతి గారు,
ఏమయిపోయారు? మీ బ్లాగులో ఈ మధ్య క్రొత్త విషయాలు ఏమీ రాయడం లేదు, ఏమిటీ సంగతి? కొంపదీసి శోభన్ బాబు గారి గురించి ఇంకా బాధ పడుతూ ఉన్నారా? ఆయన గురించి చదవగానే ముందుగా మీరే గుర్తుకు వచ్చారంటే నమ్మండి. Hang in there and keep writing. మీ క్రొత్త కథ కోసం ఎదురు చూస్తూ...

- మీ అభిమాని శ్రీనివాస్

... said...

నచ్చేసిందా అని అంత గట్టిగా మనసు అడిగితే మాత్రం నచ్చేసిందనే సెప్పాలనుకోండి!......

మాకింత తీరిక, కూసింత సమయం ఎక్కడుందండి?
ఇగో, ఈయాల కార్మిక దినోత్సవం కదా, అందుకే మెడలు వంచి మరి పని జేయాల్‌సొస్తుంది!!
గద్ గదె మరి !! సాఫ్ట్‌వేరా మజాకా !!

konne.karunakar@gmail.com

tumbu said...

chaala baaga raasaru madam, meeku mere saati..
me next tapaa kosam waiting...

Unknown said...

Hi Kranthi,
routine dialoguee,blog bagundi.Enti eemadhya rayatledu,mee pm gadu champuthunada

rākeśvara said...

నాకెందుకో బెంగుళూరులో ఆటోలు ఎక్కాలన్నా బస్సులెక్కాలన్నా ఒక రకమైన హై వస్తుంది.
ఆటో నాకిష్టమైనా, నా పర్సుకు అస్సలు ఇష్టం వుండదు. అలాగే నా తెలుగన్నడం తట్టుకోలేక ఆటోవాడు కూడా ఎందుకెక్కిచ్చుకున్నానా అనుకుంటూంటాడు.
అలాగే బస్సులెక్కితే ఏదో తెలియని ఆనందం. డబ్బులు సేవవుతున్నాయని ఆనందం ఒక ప్రక్క, ప్రాణం పోవచ్చనే థ్రిల్లు ఒక ప్రక్క (నేనెప్పుడూ ఫుట్బోర్డు మీదే వుంటాను).

Unknown said...

ఓహో మీరు మాడమ్ ఆ నేను సర్ అనుకున్నానండీ ఏదైతే ఏమి అసలు చాలా బా రాసున్నారండీ... మీ బాలాగుల ప్రత్యేకత ఏమిటంటే చాలా చిన్న విసయాన్ని అందంగా సరదాగా రాస్తారు, మీ ఫానులిస్టులో నేను కూడా సొఊఊఊఊఊపర్