Friday, May 16, 2008

ఇంగ్లీష్ నేర్చుకుందాం

ఇంగ్లీష్ అంటేనే ఒక విచిత్రమయిన భాష.నాకు,ఇంగ్లీష్ కి చాలా దూరం.నేను వీలయినంతవరకు ఇంగ్లీష్ లో మాట్లాడను,ఎందుకంటే నాకు రాదు కాబట్టి. మా టీమ్ లో అందరు అరవము,కన్నడ వాళ్ళే! అందరికి మన తెలుగు కొద్దో గొప్పో నేర్పించేసాను కాబట్టి నా పని తేలికయిపోయింది.కాని ఈమధ్యే రీహాబిలిటేషన్ సెంటర్ నుండి తప్పించుకొచ్చిన మా సునీల్ ఇంగ్లీష్ తో ఠారెత్తించేస్తున్నాడు.ఇంగ్లీష్ మాట్లాడటం,వినడము అలవాటు తప్పి అసలు ఆయనేమి మాట్లడుతున్నాడో ఆయనకి,మాకు ఎవ్వరికి అర్ధం కాకుండా పోతుంది.అందుకే మా టీమ్ లో అందరము మా అంతట మేము సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాము.మేము కూడ సునీల్ లాగ సెంటర్ లో చేరదామనుకున్నాము కాని వాళ్ళు కేవలం ప్రాజెక్ట్ మేనేజర్లనే చేర్చుకుంటారంట!

నాకు పదో తరగతి దాక ఇంగ్లీష్ లో మంచి మార్కులే వచ్చినట్టు గుర్తు,మరి ఇప్పుడెందుకు ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడ గుర్తు రావటం లేదా అని బాగ ఆలోచించాను.అప్పుడు గుర్తొచింది నాకు మా ఇంగ్లీష్ సిలబస్.active voice,passive voice.

Rama killed Ravana అంటే active voice.

Ravana was killed by Rama అంటే passive voice.

అంతే పదో తరగతి పెద్ద పరీక్షల దాక అదే active voice,passive voice.అయినా ఇంగ్లీష్ నేర్చుకోవటనికి అన్నట్టు ఎవరు చదివారు కనుక,ఎంతసేపు మార్కుల గొడవే.పదో తరగతిలో 500 పైన మార్కులు రాకపోతే ఇంక అంతే.వాడ్ని పురుగుని చూసినట్టు చూస్తారు.ఇది చాలదన్నట్టు,పదో తరగతి సంక్రాంతి సెలవల దగ్గర్నుండే ఇంటర్ కాలేజీల వాళ్ళు తయారయ్యే వాళ్ళు.500 దాటితే ఎంత ఫీజు తగ్గిస్తారో 510 దాటితే ఎంత తగ్గిస్తారో.. చెప్పి చిన్న మెదడులో బోలెడంత టెన్షన్ పెట్టించేవాళ్ళు.ఇప్పుడయితే పరిస్థితి చెయ్యి దాటిపోయింది.పదో తరగతిలో 600కి 650 మార్కులొస్తేనే శ్రీచైతన్యలో కాని,నారాయణలో కాని ఇంటర్ చదవగలరు పిల్లలు.పదో తరగతి దాకే ఇంగ్లీషు చదివేది.ఇంటర్ లో ఇంగ్లీష్ ఉన్నాకాని చదవనిచ్చేవాళ్ళు కాదు.ఇంక "స్కోరింగ్ సబ్జెక్ట్" అయిన సంస్కృతం సంగతి అయితే చెప్పనవసరం లేదు.ఎంతసేపు లెక్కలు,ఫిజిక్స్,కెమిస్ట్రీ అంతే.ఒకసారి మా చైతన్య కాలేజీలో రాత్రి 10.30కి స్టడీ అవర్ లో నేను మా వార్డెన్ కి ఇంగ్లీష్ చదువుతూ ఎర్రచేతులతో పట్టుపడ్డాను.అంతే తెల్లారి మా పెద్దసార్ దగ్గర నాకు అరగంట క్లాస్.జీవితంలో ఏద్దన్నా సాధించాలంటే integration,trignometry,బెంజీన్ రింగు ఎంత ముఖ్యమో నాకు కళ్ళు తెరిపించి,మళ్ళీ ఇంగ్లీష్ పుస్తకం ముట్టుకోనని నాతో రాతపూర్వకంగా రాపించుకొని అప్పుడు లెక్కల క్లాస్ కి పంపించాడు.కాబట్టి నా ఇంగ్లీష్ active voice,passive voice దగ్గరే ఆగిపోయింది.ఇంక ఇంజనీరింగులో మనము ఏది చదివాము కనుక ఇంగ్లీష్ చదవడానికి.నాలాంటి వాళ్ళందరికి GRE,TOEFLరాసేటప్పుడు అర్ధమవుతుంది ఇంగ్లీష్ అంటే active voice,passive voice మాత్రమే కాదు,ఇంకా బోలెడు ఉన్నాయని.కాబట్టి అద్యక్షా! నేను చెప్పేదెంటంటే తెలుగు,సంస్కృతం,లెక్కలు,ఫిజిక్స్,కెమిస్ట్రీ,ఇంకా నాకు అర్ధం కాని జంతు శాస్త్రం...అన్ని చదువుకోవాలి,కాని వాటితోపాటు ఇంగ్లీష్ కూడ చదువుకోవాలి/నేర్చుకోవాలి.

7 comments:

కిరణ్ said...

చాలా బాగా రాస్తున్నారు క్రాంతి. చిన్న ,చిన్న విషయాలను.....చదివించేలా ......సరదాగా ....మీ శైలి బాగుంది.....మీ అక్షరాల్లో మీరు కనిపించారు. వడి ,వడిగా పరిగెత్తే పిల్ల వాగులా .....చక్రం తోసుకుంటూ ఆడే చిన్న పిల్ల వెనక్కితిరిగి అల్లరిగా చూస్తున్నట్టూ అనిపించింది. కృతఙ్ఞ్తలు .......--కిరణ్

BHARAT said...

"జీవితంలో ఏద్దన్నా సాధించాలంటే integration,trignometry,బెంజీన్ రింగు ఎంత ముఖ్యమో "

keaka puTTinchaaru !!

శ్రీవిద్య said...

ఇదే మొదటిసారి మీ బ్లాగు చూడటం.చాలా బావుంది. పని మానేసి, వరస పెట్టి మీరు రాసినవి అన్నీ చదివేసాను. అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా నవ్వుకున్నాను.అంత బాగా రాసారు. keep writing.....

మీనాక్షి said...

kranthi garu hi.
chala baga rasaru.
meekunna abhimanullo nenu okarini.
mee meenakshi.byeeeee.

మీనాక్షి said...

kranthi garu mee tapalanni varasa petti chadivanu.ee rojuto mee blog ki addict ayipoyanu.
mee tapalanni chaduvutunte navvu agadam ledu.
keep writing.

Shankar Reddy said...

If you are intrested to go for Communication skill calss...pls go here

http://www.shobhamisra.com/

The best way of teaching. I really liked it.

http://ssreddyr.wordpress.com/

గిరీష్ said...

Rama killed Ravana అంటే active voice.
Ravana was killed by Rama అంటే passive voice.

idi mathram nijam, naku kuda 10th varaku (ippatiki anukunta :-)) ide active voice passive. ina mana thappemi ledule anni books lo ide ga undedi :-)

--Girish