Tuesday, July 8, 2008

ఉప్మా పురాణం

తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఏదయినా ఉంది అంటే అది "ఉప్మా".ఉప్మా నిజంగా తెలుగు పదమేనా,కాదా అంటే నాకు తెలియదు.ఉప్మా పుట్టుపూర్వోత్తారాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడ లేవు నాకు.ఉప్మా అంటే ఎందుకు నాకు అంత చిరాకంటే రెండు,మూడు,నాలుగు కారణాలున్నాయి.మొదటిది నాకు జ్వరమొచ్చినప్పుడల్లా అమ్మ ఉప్మానే చేస్తుంది.ఎందుకంటే అంటే తొందరగా జీర్ణం అవుతుందని చెప్పేది.ఇప్పుడంత తొందరగా జీర్ణం అవ్వకపోతే ఏమి కొంపలు మునిగిపోతాయో నాకు అర్ధం కాదు.రెండవది,నేను రకరకాల హాస్టల్స్ లో రకరకాల ఉప్మాలు తిన్నాను(ఏమని చెప్పను నా ఉప్మా కష్టాలు!).మూడవది,పై రెండు కారణాల్లో ఏదో ఒకటి.నాలుగవది,పై మూడు కారణాలు.

చిన్నప్పట్నుంచి కూడ మా ఇంట్లో ఉప్మా టిఫిన్ అయినరోజు నేను ప్రళయం సృష్టించేదాన్ని.భాదాకరమయిన విషయమేంటంటే మానాన్న కూడ ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు."బాగానే ఉంది కదరా,తినొచ్చు కదా!" అని చెప్పేవాళ్ళు.మీకు తెలియదు నాన్న ఉప్మా తినడం ఎంత నరకమో అని అనుకునేదాన్ని నేను.అయినా ఉప్మా తినడమే ఎక్కువంటే అందులో మా అమ్మ వేసే చెత్త చెదారం అంతా ఇంతా కాదు.కరివేపాకు(ఉప్మా తరవాత నాకు అత్యంత చిరాకు తెప్పించే పదార్ధం ఇది),కొత్తిమీర,అల్లం ముక్కలు,బీన్స్,క్యారెట్,నా మొహం..etc అన్నమాట.మా అమ్మకంతా నా పోలికే,నాకన్నా పంతం కాస్త ఎక్కువే.ఉప్మా చేసిన రోజు కావాలని నన్ను మానాన్న ముందు కూర్చోబెట్టి తినిపించేది.కళ్ళనీళ్ళు పెట్టుకున్నా కాని కనికరించేది కాదు మా కనకదుర్గ! నాకు ఉప్మా తినిపించాక అమ్మ మొహంలో విజయ గర్వం కనిపించేది.ఉప్మారవ్వతో చేసే ఉప్మా కాకుండ మాఅమ్మ ఇంక రకరకాల ఉప్మా ప్రయోగాలు చేసేది.ఇడ్లీ ఉప్మా,బ్రెడ్ ఉప్మా,సేమ్యా ఉప్మా..ఇంకా రకరకాలవి.నేనొకసారి అమ్మకి చెప్పాను,"అమ్మా! నువ్వు ఎన్ని రకాలుగా చేసినాకాని,ఉప్మాపట్ల నా మనసు మార్చుకోను.ఉప్మా,నేను బద్దశత్రువులం.మా ఇద్దరి మధ్య ఎప్పటికి ప్రేమ పుట్టదు..పుట్టదు".మాఅమ్మ కోపం నటిస్తూ "ఈ తెలివితేటలకేం తక్కువలేదు" అంటూ నవ్వేసింది.అయినా నాకు అర్ధంకాక అడుగుతాను ఇడ్లీని ఇడ్లీగా,బ్రెడ్ ని బ్రెడ్ లా తినొచ్చుకదా,మళ్ళీ అన్ని efforts పెట్టి ఉప్మాలా మార్చడం అవసరమా? ఒకసారి మీరే ఆలోచించండి.ఇంకా విచిత్రం ఏంటంటే పెసరట్టు-ఉప్మా!నేను పెసరట్టు తిని ఉప్మా మాఅక్కతో తినిపించేదాన్ని.

ఉప్మా నాకు శత్రువులని కూడ తెచ్చిపెట్టిందంటే మీరు నమ్ముతారా! కాని ఇది నిజం.చిన్నప్పుడు నేను Rose buds convent school లో LKG చదివేదాన్ని.మానాన్న నన్ను బళ్ళో చేర్చేటప్పుడు టీచర్ కి "మాఅమ్మాయికి చదువు రాకపోయినా పర్వాలేదు కాని కొట్టొద్దు" అని చెప్పారు.కాబట్టి టీచర్ నన్నేమి అనేది కాదు.రోజు మాటీచర్ నాకు అటుకులు,పంచదార కలిపిస్తే తినేసి అరుగు మీద పడుకునేదాన్ని.స్కూల్ అయిపోయే టైమ్ కి కృష్ణ నన్ను నిద్ర లేపేవాడు.వాడితో కలసి ఇంటికొచ్చేదాన్ని.కృష్ణ మా పక్కింట్లో ఉండేవాడు.వాడు కూడ నాక్లాసే! ఒకరోజు కృష్ణ నన్ను ఫాస్ట్ గా లాక్కెళ్తున్నాడు స్కూల్ కి.నేను ఆ పేస్ కి మ్యాచ్ అవ్వలేకపోయా.అంత ఫాస్ట్ గా నడవలేక నేను నీతో రాను అని ఒక చెట్టుకింద కూర్చున్నాను.కృష్ణకి చాలా కోపమొచ్చింది."తొందరగా నడుస్తావా,లేదా?ఉప్మా మొహమా!" అని అన్నాడు.నన్ను ఉప్మా మొహం అంటావా అని పక్కనే ఉన్న రాయితో వాడి తలమీద ఒక్కటిచ్చా! అంతే క్షణాల్లో వాడి మొహమంతా రక్తం.తెల్లటి వాడి షర్ట్ కూడ ఎర్రగా అయిపోయింది.మా ఇద్దరికి రక్తం చూసేసరికి కంగారు పుట్టింది.ఇద్దరం రోడ్డుమీదే నిల్చోని ఏడుస్తుంటే ఎవరో ఒకాయన మమ్మల్ని సైకిల్ మీద ఇంటికి తీసుకొచ్చాడు.హాస్పిటల్ కి తీసుకెళ్ళాక వాడి గుండుకి కుట్లు పడ్డాయి.నేను కొట్టిన ఉప్మా దెబ్బతో వాడి డిప్ప షేపు మారిపోయింది.ఆ తరవాత కృష్ణ మళ్ళీ ఎప్పుడు నన్ను స్కూల్ కి తీసుకెళ్ళలేదు.ఆడుకోవడానికి కూడ మా ఇంటికి వచ్చేవాడు కాదు.అసలు నన్ను చూస్తేనే చాలు భయపడేవాడు.వాడు మాట్లాడకపోతే వాడి ఉప్మా ఖర్మ అనుకొని నేను కూడ వదిలేసాను.అయినా ఫ్రెండ్షిప్ లో ఆ మాత్రం చిన్న చిన్న గొడవలు రావా ఏంటి? ఆమాత్రానికే మాట్లాడటం మానేస్తే ఎలా?

ఇంక పెళ్ళిళ్ళప్పుడు,వ్రతాలప్పుడు చూడాలి,సామిరంగా! ఒక్కొక్కడు మానెడు ఉప్మాలో సోలెడు చట్నీ పోసుకొని లాగిస్తుంటాడు.మళ్ళీ గడికొకసారి ఎవరోఒకరు వచ్చి "పలహారాలు తిన్నారా?" అని అడుగుతారు.ఆ పెద్ద పెట్టావులేవోయ్ గొప్ప పలహారం అని అనుకుంటాను నేను.ఇంతకీ ఉప్మా పురాణంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే,ఉప్మాది మైనపు నమూనా చేసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టాలి.అంతటి ఐటమ్ ఛీజ్ ఉప్మా.

70 comments:

Unknown said...

awesome..

Srividya said...

as usualga kummesaaru. i too hate upma. upma chesina rojuna naa edupu moham choodaleka, hotel idli testaaru naanna.

Kottapali said...

అయ్యో .. ఉప్మా నచ్చదా? ఉప్మా పెరిత ఏ చెత్త పెట్టినా తినేస్తాన్నేను.

Sujata M said...

I like basic Upma.. than anything. I am a Upma Lover... :D Its surprising that you dont like (nearly hate) upma.

రవి వైజాసత్య said...

హాహాహా..మా ఇంట్లో మీలాగా మా చెల్లెల్లిద్దరూ "ఉప్మా"తాండవం చేసేవారు

వికటకవి said...

భలే. పెళ్ళిళ్ళలో అల్పాహారం పేరుతో భోజనం ముందుగా పెట్టే గోధుమరవ్వ ఉప్మా, అసలు వంటకాలని జనాలు సాధ్యమైనంత తక్కువగా తినేట్లు చెయ్యటానికే అన్నది నా ఘాట్టి నమ్మకం. లేకపోతే, ఉప్మాలో ఆ అల్లం ముక్కల్ని అత్యంత దారుణంగా దంచి వెయ్యకుండా, అలా బండ బండ ముక్కలుగా కోసి అదేదో పాయసంలో జీడిపప్పు ముక్కల్లా తినమంటే ఎవడు తింటాట్ట?

Kathi Mahesh Kumar said...

నిజమే! నాక్కూడా ఉప్మా అంటే అలర్జీనే. ఇంట్లో ఐనా హాస్టల్ లో అయినా వారానికొకసారైనా ఇది తప్పేది కాదు.

కానీ బెంగుళూరు హోటళ్ళలో ‘టమాటా బాత్’ అని ఉప్మాలో కాస్త టమాటాలు ఎక్కువేసి చేస్తారు. అది ఆశ్చర్యంగా నాకు నచ్చింది. మన తెలుగు ఉప్మా రుచే ఇప్పటికీ కాస్త ఇబ్బంది.

శ్రీ said...

మీకు ఉప్మా నచ్చదంటుంటే నేను చిన్నపుడూ "విపుల"లో చదివిన కథ ఒకటి గుర్తుకువచ్చింది.కథలో నాయకుడు పెళ్ళికి వెళ్తే అక్కడ ఉప్మా పెడతారు.ఇతనికి ఉప్మా అసలు ఇష్టం ఉండదు,పక్కన బంతిలో కూర్చున్న మిగతావాళ్ళు ఉప్మా ని ప్లేటులో నుండి చేతిలో తీసుకుని గుండ్రంగా చేసి గాలిలోకి విసిరి నోట్లో గుటకేస్తారు.చుట్టుపక్కల అందరూ ఇలా లొట్టలు వేస్తూ తింటూ ఉంటే ఇతనికి మాత్రం తేళ్ళూ,జెర్రులూ పాకినట్టు ఉంటుంది.

జ్యోతి said...

నేను మాత్రం వేరేవాళ్లు చెసిపెడితె కొంచెం తింటాగాని, నేను చేసుకున్నది నాకు తప్ప అందరికి నచ్చుతుంది. అందుకే చుట్టాలొస్తే ఎంతో బుద్ధిమంతురాలిలా "ముందు మీరు తినండి. నేను తర్వాత తింటాను" అని చేసిందంతా వాళ్ళకే పెట్టేస్తాను మాటల్లో పెట్టేసి. మిగిలితే నేనే తినాలి. పడేయబుద్ధి కాదు. కాని పెద్దాళ్ళయ్యాక మా పిల్లలు ఉప్మా తినే బదులు ఊరకున్నది మేలు అంటుంటే అసలు చేయడమే మానేసా. రవ్వ కొంటే లడ్డులు చేసుకోవాలి తప్ప ఉప్మాకి పనికిరాదు మా ఇంట్లో.. హాయిగా నాకే పని తప్పింది అని సంతోషిస్తా.

రాధిక said...

peLLavvaka mumdu varaku cetta upmaa aneadaanni.adeamiToa america vachchaakaa tega ishTam perigipoayindi.
mii post cadivaakaa mii noaTloa guppeDu upmaa peTTaalanipistumdi.:) :)

సుజాత వేల్పూరి said...

ఉప్మా ద్వేషుల సంఘం పెడితే మెంబర్ షిప్ కట్టి మరీ చేరతా నేనైతే! మా ఇంట్లో మా తాతగారిదో, నానమ్మదో తద్దినాలు వస్తే మా అమ్మ కిలో రవ్వ ఉప్మా చేసి మా మొహాన పడేసేది.(ఉప్మా అయితే కడుపులో రాయిలా కూచుంటుందనీ, భోజనాలు లేటైనా పిల్లలు హాహాకారాలు చేయకుండా ఉంటారనీ)పెళ్ళిళ్లలో అయితే ఉప్మా అల్టిమేట్ టిఫిను! నూనె కారేలా వండి చట్నీతో వడ్డిస్తారు.

నేననుకోవడం క్రాంతీ, నీకు వంట పెద్దగా రాక(ఎంతైనా పెళ్లైన కొత్త కదా) రోజూ మీ వారికి ఉప్మా చేసి పెట్టి, చివరకు ఈ టపా రాశావేమోనని!

సిరిసిరిమువ్వ said...

బాగుంది మీ ఉప్మా పురాణం. మా పిల్లలు కూడా మీ టైపే.మీరింకా మీ నాన్నగారి భయంతో కాస్త నంజేవాళ్లేమో, మా పిల్లకాయలు మాత్రం వాళ్ల నాన్న కాదు కదా వాళ్ళ నాన్న వచ్చినా చచ్చినా నోట్లో పెట్టరు.

Dr. Ram$ said...

ఏంటి, ఉప్మా నచ్హదా?? మీకు తినడము రాకపోతే గమ్మున వూరుకోండి..అంతే కాని యిలా బ్లాగుల కెక్కి, ఓ ఉప్మా ద్వేషి సంఘాలు అంటూ హడావుడి సేయకండి..నాకు ఎంత మండుతుంది అంటే..
ఓ క్రాంతి, ఉప్మా నే కదా అని తీసి పారేస్తే , వుత్త కరివేపాకు, అల్లం ముక్కల స్పెషల్ ఉప్మా పెట్టాలిసి వస్తుంది.. హ్హ హ్హ హ్హ..

ఉప్మా తినడము అనేది ఒక కళ అండి బాబు ఒక కళ... ఉప్మా ని గట్టి గా కాకుండా, కాస్త మెత్తగా చేసుకొని, అందులో కారపు పొడి వేసుకొని, ఆయి వేసుకొని తిన్నారా ఎప్పుడైనా? అట్లానె అల్లం చట్నీ కాని, టొమాటో చట్నీ కాని ట్రై చేసారా?? యివి అన్ని కేవలం బొంబాయి రవ్వ ఉప్మా కే.. నాకు గోధుమ రవ్వ ఉప్మా అంటే ఎలర్జీ. కాని పెళ్ళిళ్ల లో మీరు చెప్పిన మానెడు ఉప్మా లో సోలెడు చట్నీ ఉపమానము కేక.. నా ఉప్మా ఆత్మ ఎంత ఘోషిస్తేనో యిలాంటి వ్యాక్య రాసానో అర్ధం చేసుకోగలరు...
దయ చేసి ఇంకెప్పుడు "ఉప్మా నే కదా అని హీనంగా చూడకండి ఘోరం గా దెబ్బ తింటారు"..మ్మ్మ్మ్మ్

GIREESH K. said...

బాగుందండీ మీ ఉప్మా పురాణం! నేనూ ఒకప్పుడు ఉప్మా ద్వేషినే. కానీ బెంగళూరు కొచ్చాక నా అభిప్రాయం కాస్త మారింది.

మన ఆంధ్రా ఉప్మా సంగతెలావున్నా, ఇక్కడ బెంగుళూరు టిఫిన్ సెంటర్లలో, ఖారాబాత్ అని దొరుకుతుంది. ముఖ్యంగా, అడిగాస్ లో కానీ, రాగిగుట్ట SLV లో కానీ ట్రై చేసిచూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందనుకుంటా.

RG said...

ఇంట్లోఉండేటప్పుడు నాకూ ఉప్మా నచ్చేదికాదు, బెంగళూరు వచ్చి టమాటాబాత్ టేస్ట్ చేశాక తెలుగు ఉప్మా మీద ఎక్కడలేని ప్రేమా పుట్టుకొచ్చింది. అందుకే ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మని షంటిమరీ ఉప్మా పెసరట్టు చేయించుకు తింటాను.

పనిలో పని, బెంగుళూరు బ్లాగర్లార, ఇక్కడ పెసరట్టెక్కడ దొరుకుతుందో చెప్పి పుణ్యం కట్టుకోండి.

Unknown said...

'మానెడు ఉప్మాలో సోలెడు చట్నీ..'
దీనికి ఇవ్వొచ్చండి మీకు ఒక బస్తాడు ఉప్మా రవ్వ !
:D

నాకూ ఉపహారాలలో నచ్చని ఏకైక పదార్ధం 'ఉప్మా '
చాలా మంది ఉప్మా - పెసరట్టు అంటే ఆహా ఓహో అని లొట్టలేస్తారు. అదేంటో నాకు అసలు నచ్చదు.

ఉప్మా బాధితుల సంఘం లో నన్ను కూడా చేర్చుకోండి.
:)

చైతన్య.ఎస్ said...

బాగుంది మీ ఉప్మా పురాణం . నాకు ఉప్మా నచ్చదు. కాని bangalore వచ్చాక ఖారాబాత్ బాగా అలవాటు అయింది.కావున మీ ఉప్మా వ్యతిరేకుల సంఘం లో సభ్యత్వం గురిచి కొంచెం ఆలొచించాలి.

Purnima said...

కాంతిగారు: ఉప్మా గురించి మీరేమి రాసారో.. నేనేమి చదివానో గాని.. "ఉప్మా మొహం" ఆనిపించుకున్నారే అది మాత్రం హైలైట్!! I'm sorry but can't stop laughing. :-)

మీ ఉప్మా పురాణం చదువుతుంటే.. నేను చేసిన మొదట ఉప్మా గురించి రాయాలనిపిస్తుంది. అవునూ.. మొన్న మా కోలీగ్ ఒక అమ్మాయ్.. పొద్దున్నే హడావిడిలో రవ్వ అనుకుని గసగసాలతో ఉప్మా చేసిందట. పంపించమంటారా కొంచెం?? ;-)

kalpana said...

naku oka doubt..anta ishtam leni danivi naa daggara nerchukono maree mee vaarini himsistunnaveduke??
sare gani..aa krishna gadu ninnu jeevitamlo kshaminchadu.

వేణూశ్రీకాంత్ said...

టపా అదిరింది క్రాంతి గారు, ఉప్మా మొహం, మానెడు ఉప్మా కేక... భలే నవ్వించారు... కానీ నేను ఉప్మాకి వీరాభిమానిని... మీరు చెప్పిన అన్ని వెరైటీలు నాకు నచ్చుతాయ్. నూనె ఎక్కువైతే వెగటు వస్తుంది కానీ సరిగా వండితే దానికి పోటీ నే లేదండీ... అసలు ఉప్మా లేని పెసరట్టు దరి దాపులకి కూడా వెళ్ళను నేను.

RSG, High profile restaurants నాకు తెలీదు కాని తిప్పసంద్ర main Road లో Plantain leaf అంధ్రా restaurant కి దగ్గర లో 80 ఫీట్ రోడ్ వైపు నుండి వెళ్తుంటే ఎడమ వైపు ఒక గల్లీ లో ఆదివారం ఉదయం మాత్రం ఉప్మా పెసరట్టు దొరుకుతుందండీ. అక్కడ హైజీన్ కొంచెం ప్రశ్నార్ధకమే కాని అప్పుడప్పుడు ఉప్మా పెసరట్టు పార్సెల్ తెచ్చుకునే వాడ్ని.

హ హ పూర్ణిమా గసగసాల ఉప్మా అల్టిమేట్... క్రాంతి గారికి కొంచెం పంపించమనండి ఈ సారి టపా వ్రాసే ధైర్యం కూడా చేయరు.

వేణూశ్రీకాంత్ said...

మరో విషయం మరిచాను అసలు ఉప్మా కన్నా ఫాస్ట్ గా తయారు చేయగల బ్రేక్ ఫాస్ట్ ఇంకేదైనా ఉందా... కొనుక్కొచ్చుకున్న రెడీ మేడ్ దొశల పిండితో దోశలు అని చెప్పకండేం :-)

Unknown said...

సరయిన ఉప్మా తినక మీరిలా మాట్లాడుతున్నారు :-)

అబ్బో మా అమ్మ చేసే ఉప్మా కేక... ఉప్మా పెసరెట్టు అయితే ఇంక చెప్పక్కర్లా.

Srinivas Sirigina said...

దిసీజ్ టూ మచ్. మీకు ఉప్మా నచ్చకపోతే ఏ ఇడ్లీలో తిని కూర్చోవాలిగానీ, ఇలాంటి బ్లాగులు రాసి మా వంటి ఉప్మా లవర్స్ ని బాధ పెట్టడం ఏం బాగోలేదు. మా ఆవిడ కూడా మీ టైపే, తను తినదు, చెయ్యదు. పెళ్ళయిన కొత్తలో "నేనేమన్నా మణులడిగానా, మాణిక్యాలడిగానా, ఒక్క ప్లేటు ఉప్మానే కదా అడిగింది" అని ఒకసారంటే, అదరాబాదరాగా ఐదు నిమిషాల్లో ఉప్మా చేసి నా మొహన్న కొట్టి, తను సీరియల్స్ తింది. ఇంకేం అడుగుతాం అలాంటి వాళ్లని. ఇంతకూ, మీ శ్రీవారు ఉప్మా ఇష్టులో, కాదో చెప్పనే లేదు, తలుచుకొంటేనే పాపం అనిపిస్తుంది.

Kottapali said...

ఈ టపాకి వచ్చిన వ్యాఖ్యలన్నీ గమనించగా తేలిన పరమ సత్యం ఏవిటంటే .. బ్లాగర్లు ద్వివిధములు. ఉప్మాను ద్వేషించువారు, ఉప్మాని ప్రేమించువారు. అంతే కానీ మధ్యే మార్గం ఉన్నట్టు లేదు.
Never imagined that this simple tiffin could whip up such passions!

Anil Dasari said...

మూడవ రకము బ్లాగరులు కూడా కలరు - వేడి ఉప్మాని ద్వేషించి చల్లటి ఉప్మాని ప్రేమించే నాబోటి వాళ్లు. అదేంటోగాని వేడిగా పొగలు సెగలు కక్కే ఉప్మా నచ్చదుకానీ, చల్లారిపోయిన చద్దుప్మా తెగ నచ్చుతుంది నాకు! జిహ్వకో రుచి. ఇడ్లీల విషయంలో దీనికి పూర్తికా ఆపోజిట్. నా పార్టీలో ఇంకెవరన్నా ఉన్నారా?

Unknown said...

నాలుగవ రకము కూడా కలరు. వేడి వేడి ఉప్మాను ఆరగించి చల్లని ఉప్మా అంటే పారిపోయేవారు.

చిలమకూరు విజయమోహన్ said...

ఏ టపాకి రానన్ని కామెంట్ లు ఉప్మా పురాణానికి వచ్చాయంటే ఉప్మా గురించి ఆలోచన చేయాల్సిందే

ప్రపుల్ల చంద్ర said...

నేను చాలా మందిని చూసాను తినని వాళ్ళని.
ఉప్మా అంటే నాకు మాత్రం చాలా ఇష్టం !!!! రకరకాల కాంబినేషన్స్ లో తింటూ ఉంటాను. .

Dr.Pen said...

నేను పేద్ద ఉప్పమ్మ లవర్ని. ఉప్మాని మా డాడీ అలానే పిలుస్తారు మఱి! కాకపోతే వేడి,వేడి పొగలు కక్కే ఉప్మా...ఇక చల్లటి ఉప్మాలో గడ్డ పెరుగు వేసుకొని కాస్త అల్లం పచ్చడి నంజుకొని తింటే.ఆహా!ఏమి రుచి... తినరా మైమరచి!

మేధ said...

కొరియా కి రాకముందు అయితే నేను కూడా మీకు సంఘీభావం ప్రకటించి ఉండేదాన్ని కానీ, ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తోంది!
ఇక్కడ మా గెస్ట్ హౌస్ వాడు ఇండియన్ ఫుడ్ పెట్టినా, అది రోజు తినాలంటే చిరాగ్గా ఉంటుంది.. అదీ కాక బ్రేక్ ఫాస్ట్ కార్న్ ఫ్లేక్స్ - నాకు అస్సలు నచ్చదు.. ఇంకా నేను వచ్చేసరికి రోజూ అర్ధరాత్రి అవుతుంది, అప్పటికి అన్నీ క్లోజ్ - సో ఈ కారణాలన్నిటి వల్ల, నేనే రూమ్ లో ఏదో ఒకటి చేసుకోవాల్సిన పరిస్థితి!.. ఇంటి దగ్గరనుండి ఊరికే బ్యాగ్ లో పడి ఉంటుంది కదా అని ఉప్మా మిక్స్ లు తెచ్చా.. ఇప్పుడు వాటితోనే కడుపు నింపుకోవాల్సిన స్థితి!!!
కాబట్టి అధ్యక్షా, నేను ఇండియా వచ్చేవరకూ మీరు కాస్త ఆగి వచ్చిన తరువాత మనిద్దరమూ ఉప్మా వ్యాప్తి నిరోధక ఉద్యమం చేపడదాం!!!

క్రాంతి said...

ఏదో నోటి(చేతి) దూల ఆపుకోలేక ఉప్మా పురాణం రాసాను కాని ఉప్మా లవర్స్ ని నొప్పించాలనే ఉద్దేశ్యం నాకు అస్సలు లేదని నేను సవినయంగా మనవి చేస్తున్నాను.అలా అని ఉప్మా పట్ల నాఅభిప్రాయం మాత్రం మారలేదండోయ్!

@శాంతి గారు
థాంక్స్ అండి.

@శ్రీవిద్య గారు
మీరు అదృష్టవంతులు,మీ ఇంటికి దగ్గర్లో హోటల్స్ ఉన్నట్టున్నాయి.

@కొత్తపాళీ గారు
అయ్యో!అవునా! ఉప్మా అంటే అంత ఇష్టమా!

@సుజత గారు(గడ్డిపూలు)
నాకు అలా ఇడ్లీ అంటే ఇష్టమండి.

@రవి గారు
:) అంటే ఉప్మా తాండవం గురంచి నాకన్నా మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది!

@వికటకవి గారు
నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

@మహేశ్ గారు
నేనింకా బెంగుళూరు టమాట బాత్ ట్రై చెయ్యలేదండి.కాబట్టి ఇప్పుడే దాని గురించి ఏమి రాయలేను.

@శ్రీ గారు
:)

@జ్యోతిగారు
ఎంతయినా మీరు గడుసువాల్లండి :)

@రాధిక గారు
అమ్మో! అంతపని మాత్రం చెయ్యకండి.ప్లీజ్..జ్..జ్..జ్

@సుజాత గారు(మనసులో మాట)
అమ్మ! నాకు వంట రాదని భలే కనిపెట్టేసారండి మీరు.ఉప్మా కూడ చేసాను,కాని అంత గొప్పగా ఏమి లేదు.ఇక ఉప్మా ద్వేషుల సంఘం గురించి మనం ఆఫ్ లైన్ మాట్లాడుదామండి,ఎందుకంటే చూస్తుంటే ఉప్మా లవర్స్ చాలా మందే కనపడుతున్నారు.ఇక్కడ మన సంఘం గురించి మాల్టాడటం అంత సేఫ్ కాదేమో!

@సిరిసిరిమువ్వ గారు
:)

@డా.రామ్స్
అంటే మీకు ఉప్మా అంటే ఇంత ఇష్టమని తెలియక ఏదో ఏదో రాసేసాను,ఈ ఒక్కసారికి క్షమించేయండి. :)

@గిరీష్ గారు
మీరు చెప్తున్నారు కాబట్టి రాగి గుట్ట SLV లో ఉప్మా ట్రై చేస్తానండి.దాని మీద ఇంకొక టపా కూడ రాస్తాను. :)

@rsg గారు
అడయార్ ఆనంద్ భవన్ లో పెసరట్టు ఉప్మా దొరుకుతుంది,మరి ఇంకా ఎందుకు ఆలస్యం.హైజెనిక్ గా కూడ ఉంటుంది.దానికి నేను గ్యారెంటీ!

క్రాంతి said...

@వేణు గారు
ఉప్మా భాదితుల సంఘంలో మిమ్మల్ని చేర్చుకుంటాం,కాని మీరు "బస్తాడు ఉప్మారవ్వ బహుమతి" ఆలోచనని విరమించుకుంటానని హామి పత్రం రాసివ్వాలి మరి :)

@చైతన్య గారు
మీకు సభ్యత్వం ఖరారయింది.వంద రూపాయలు కట్టి మీ సభ్యత్వ గుర్తింపు కార్డుని పొందగలరు :)

@పూర్ణిమ గారు
గసగసాల ఉప్మానా! ఎందుకండి నేనంటే అంత కసి మీకు?

@కల్పన
ఆపత్కాలంలో పనికొస్తుందని నేర్చుకున్నాను. :)

@వేణు శ్రీకాంత్ గారు
దో మినట్ నూడుల్స్! ...హి..హి..హి..హి

@ప్రవీణ్ గార్లపాటి గారు
తప్పదండి,నేను మీ ఇంటికి ఒకసారి భోజనానికి(ఉప్మాకి) రావాల్సిందే!

@కొత్తపాళీ గారు
@అబ్రకదబ్ర గారు
@ఫణి ప్రదీప్ గారు
ఇందుమూలంగా నాకు తెలిసిందేమిటంటే ఉప్మాలో ఎన్ని రకాలు కలవో ఉప్మా లవర్స్ లో కూడ అన్ని శాఖలు కలవు.

@విజయ మోహన్ గారు
అవునండి,ఉప్మా గురించి ఆలోచించాల్సిందే!

@చంద్ర గారు
:) మీరు కొత్తదనాన్ని కోరుకుంటారన్నమాట! హిహిహి :)

@డా.స్మైల్ గారు
:)

@మేధ
మీరు తొందరగా ఇండియా వచ్చి ఉద్యమంలో పాలు పంచుకోవాలని మనవి చేస్తున్నాము.అప్పటిదాక ఉప్మా తింటూ ఆరోగ్యం కాపాడుకోగలరని ప్రార్ధన :)

త్రివిక్రమ్ Trivikram said...

క్రాంతి గారూ!

ఉప్మా పుణ్యమా అని మీ హ్యూమరథం మళ్ళీ టాప్ గేర్లోకొచ్చేసింది. అభినందనలు!! అందుకే ఉప్మాకు కూడా నా జిందాబాదులు. :)

శ్రీ గారూ!

అది విపులలో చదివిన కథ కాదు. పి. చంద్రశేఖర్ ఆజాద్ రాసిన ది రోడ్ అనే నవల. చతురలో వచ్చింది. ఉప్మా నచ్చని వాళ్ళు ఉంటారని అది చదివేవరకూ నాకూ తెలీదు. కానీ ఆ తర్వాత క్రాంతి లాంటి ఉప్మాద్వేషులు చాలామందే తారసపడ్డారు. :)

సీనుగాడు గారూ!

అబ్బా ముందుగా మీ పేరు మార్చుకోండి సార్! "ఐదు నిమిషాల్లో ఉప్మా చేసి నా మొహన్న కొట్టి, తను సీరియల్స్ తింది." :D.

మేధ గారూ!

ఉప్మా వ్యతిరేకుల సంఘమో లేక ఉప్మా నచ్చనివాళ్ళ సంఘమో పెట్టుకోండి. మరీ ఉప్మా వ్యాప్తి నిరోధక సంఘమంటే పాపం ఉప్మా ఉపాసకులేం కావాలి?

Rajendra Devarapalli said...

ముందు ఇక్కడ నా కామెంటు ఏమయ్యింది చెప్పండి?ఉప్మా ప్రియుల కుట్రా ఇది?అసలు ఉప్మా ను ప్రపంచజనులందరూ ఎందుకు ద్వేషించాలొ చెప్తూ చిన్న థీసిస్ రాసా?నాకు సమాధానం చెప్తారా?ప్రకాష్ కారత్ కు కంప్లంట్ ఇమ్మంటారా??

Shiva Bandaru said...

నాకు మాత్రం బియ్యాన్ని నూక కింద మర ఆడించి తయారు చేసిన ఉప్మా అంటే చాలా ఇస్టం. ఏ వంటైనా చేసే వారినిబట్తి రుచి ఆధారపడిఉంటుంది.
శివ-స్పీక్స్

oremuna said...

ఐ హేట్ ఉప్మా!

చాలా నవల్లో స్పెషల్ గా ఉప్మా చేసి పెట్టారని చదివినప్పుడల్లా ఉప్మాలో స్పెషల్ ఏముంటుంది? అని ముక్కున వేలేసుకుంటాను!

బట్ ఐ ఈట్ ఉప్మా ! నా బోటి హాస్టల్లల్లో చదువుకున్న వాళ్లు ఏ రాయి పెట్టినా తినే పళ్లు దేవుడు ముందే ఇస్తాడు కదా.

కానీ గోధుమ రవ్వ ఉప్మా మాత్రం ముద్ద కూడా దిగదు. బొంబాయి రవ్వ పర్వాలేదు ఏదో ఉప్మా లో పచ్చి మిరపకాయలు/ఉల్లిగడ్డలు బాగున్నాయని తృప్తి పడుతూ మామిడికాయ కారంతోనో, పంచదారతోనో, నిమ్మకాయతోనో తినవచ్చు.

ఓవర్ ఆల్ ఉప్మా ఈజ్ లాస్ట్ ఇన్ ఆల్ టిఫిన్స్ !

చదువరి said...

పొగ తాగనివాళ్ళ సంగతేమో గానీ.. ఉప్మా తినని వాళ్ళ గతి మాత్రం అంతేనని ఈ మధ్యే వికటకవి చిన్నాన్న ఉరఫ్ భంగు బాబాయ్ చెప్పగా తెలిసింది. ఇహ మీ ఇష్టం!

రాజేంద్ర గారూ, యూపీయే సమావేశాల్లో పెట్టే ఉప్మాలో జీడిపప్పు వెయ్యకపోవడంతో కారత్తుకు, బర్దనుకు కోపాలొచ్చాయట. అసలు వాళ్ళు మద్దతు లాగేసుకోడానికి కారణం అదేనని కర్ణపిశాచి కథనం!

క్రాంతి said...

@సీనుగాడు గారు
అవును,మీరు పెఅరు కొంచెం మార్చి పెట్టుకొండి ప్లీజ్,"సీనుగాడు" అని అనాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది.

@త్రివిక్రమ్ గారు
థాంక్స్ అండి.

@రాజేంద్ర గారు
మీ కామెంటుని తీసేసే దమ్ము ఎవరికుంది చెప్పండి?

@శివ్ గారు
:)

@ఒరెమునా
మీరు కూడ హాస్టల్ పక్షులేనన్నమాట!

@చదువరి గారు
అంతే అంటారు.ఇంతకి ఈ భంగు బాబాయ్ ఎవరో నాకు తెలియదు :(

ravindra said...

హాయ్ క్రాంతీ,
నేను మీ బ్లాగు కి అభిమానిని. చాలా సహజంగా రాస్తారు. ఎప్పటినుంచో వ్యాఖ్య రాద్దామనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఈ టపా కూడా కేక. బియ్యపు రవ్వ ఉప్మా అని కూడా ఉంటుంది. అది ఒకసారి ట్రై చేయండి.:)

మాలతి said...

ఇంత కథా, వ్యాఖ్యలు చదివింతరవాత, ఏంచెయ్యను.. వెళ్లి ఉప్మా చేసుకుంటాను.. :)

మీనాక్షి said...

ayyo andaru eppudo raasesaaru comments..
nenu ee roje chusaanu..
kranthi garu...keka..kummesaru,.
kranthi garu..mee tapalu chala istanga chaduvutanu.
nenu mee abhimanini...telusaa..

Niranjan Pulipati said...

నాకూ ఉప్మా చాలా ఇష్టం.. అసలు బొంబాయి రవ్వతో చేసే ఏ వంటకమైనా .. "ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి "
అనుకుంటూ ఆరగించటమే తరువాయి..
కానీ సేమియా ఉప్మా అంటే మాత్రం కష్టమే.. సేమియా ఉప్మా కి నాకూ ఏమాత్రం పడదు..
క్రాంతి గారు.. ఎప్పటిలాగే ఈ టపా కత్తి కమాల్..

Anil Dasari said...

'అటుకుల ఉప్మా' గురించి ఎవరూ ప్రస్తావించినట్లు లేరు. ఇంకా, 'ఉప్మా పాయసం' అనేది కూడా ఒకటుంది (నీళ్లెక్కువైన సేమియా ఉప్మా అన్నమాట). నా ఉద్దేశ్యంలో కేసరి అనబడే తీపి పదార్ధం కూడా స్వీటు ముసుగులోనున్న ఉప్మానే - ఉప్పుమా లో ఉప్పు బదులు పంచదార వేస్తే కేసరి అన్నమాట. హల్వా కూడా ఇలాంటి మారువేషంలోని ఉప్మానేనేమో. ప్రపంచంలోని జీవజాలమంతా - చెట్లతో సహా - రూపు మార్చుకున్న నీరు (water) అనే థియొరీ ఒకటి ఉంది. అలాగే ప్రపంచంలోని తిండి పదార్ధాలన్నీ మారు వేషంలోని ఉప్మానేనేమో!!

వేణూశ్రీకాంత్ said...

క్రాంతీ, మీ టపాకి వచ్చిన కామెంట్లు చూస్తుంటే ఉప్మా తప్పకుండా "మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం" లో పెట్టాల్సినంతటి ఐటమ్ చీజ్ అనడం లో సందేహం లేదనిపిస్తుంది. ఇష్టపడినా వ్యతిరేకించినా ఇందరి చేత కామెంట్ వ్రాయించిందంటే ఆహా! భళీరె ఉప్మా!!..

హా! ఆఖరికి దో మినుట్ నూడుల్స్ అయినా తింటా కానీ నో ఉప్మా అంటారు, ఇంకేం చెప్తాం.

Ajay :) said...
This comment has been removed by the author.
Ajay :) said...
This comment has been removed by the author.
గీతాచార్య said...

what can I say. I too have upmaa hardships.

Vidya said...

Hi! Nuvvu chala baga vrasthavu Kranthi.kadedhi kavitha kanarham annatlu kadedhi blogging ki anarham annatlunnayi mee blagulu.Neenu nee blagulaku addict ipoyyanu.
Vidya.

క్రాంతి said...

@రవీంద్ర గారు
థాంక్స్ అండి.మీరు చెప్పిన బియ్యపు రవ్వ ఉప్మా గురించి నాకు తెలియదండి.తెలుసుకొని మావారి మీద ప్రయోగిస్తానులెండి :-P

@te.thulika gaaru
ఉప్మా చేసుకున్నారా మరి??

@మీనాక్షి
ఏదో నీ అభిమానం మీనాక్షి!!

@నిరంజన్ గారు
థాంక్స్ అండి

@అబ్రకదబ్ర
:)ఉప్మాల్లో నాకు తెలియని రకాలు ఇంకా చాలా ఉన్నాయి సుమా!

@వేణు శ్రీకాంత్ గారు
నిజమేనండి,ఉప్మాకు ఇంత స్పందన వస్తుందని నేను కూడ ఊహించలేదు.

@అజయ్
అజయ్! నీకున్న కష్టాలన్నింటిని అధిగమించాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను.

@గీతాచార్య గారు
:)

@విద్య గారు
నాబ్లాగు కి అడిక్ట్ అయిపోయానని చెప్పి మీరు నన్ను పడగొట్టేసారండి.ఈ సంతోషంలో నేను ఉప్మా తినేసినా తినేస్తాను కావచ్చు :)

tumbu said...

chaala baga raasarandi upma guinchi...hostel affects ki nenu upma dveshini ayyanu..e madyane bangalore punyama ani karabath tintunna..inka ma avida vachi raani upma chestundi..adi tinaka tappatam ledu...

cbrao said...

@ క్రాంతి: "ఇంతకీ ఈ భంగు బాబాయ్ ఎవరో నాకు తెలియదు." - ఈ వికటకవి భంగు బాబాయ్ 'పురాణ ప్రలాపం' అనే పుస్తకంలోని ముఖ్య పాత్ర . ఈ పుస్తకం  గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

http://deeptidhaara.blogspot.com/2008/06/blog-post_04.html   

సుధీర్ వూణ్ణ said...
This comment has been removed by the author.
Ramani Rao said...

బాగుందండి ఉప్మా పురాణం. సెమియా ఉప్మా మా పిల్లలు ఇష్టంగా తింటారు.అలాగే పెసరట్టు ఉప్మా కూడా(కాంబినేషన్ సూపరండీ బాబు), అవునూ క్రాంతి గారు, మనలోమన మాట మీకు గాని మీ వారి మీద కోపం వస్తే ఈ ఉప్మాతోటే కోపాన్ని ప్రదర్శిస్తార? ఈ ఒక్క విషయం చెప్పలేదేంటి చెప్మా ఈ ఉప్మా పురాణం లో మొత్తం పెసరట్టు ఉప్మా తింటూ గాలించా.

Unknown said...

ఏమీ అనుకోకపోతే ఇక నుండీ మీ పేరు ఉప్మా కాంతి గారు, నేను చూస్తున్నాను అందరూ అయిపోయాక రాద్దామనుకుంటున్నాను, అసలు ఆగితేగాకామెంట్స్ .. ఇక నుండీ మీ పేరు మాత్రం ఉప్మ క్రాంతి గారే ఇది పక్కా.... సరదాగా అండీ, ఏమనుకోవద్దు

రానారె said...

త్రివిక్రం చెప్పినట్లు ఉప్మాతో మీ హ్యూమరథం మళ్లీ టాప్ గేర్లోకి వచ్చింది. ఉప్మాను కొందరు పల్లెజనాలు ఉబ్బిండి లేదా ఉప్పిండి అనటం విన్నాను.

Anonymous said...

aaaa upma nachadaaaaaa strange i love upma i like upma kaakapote nenu chesindante naaku asayam....

k just go through my blog bhaskaravajjula.blogspot.com n comment me waiting for u....r comments

రాజ్ కుమార్ said...

soooper......

akka said...

avune ela thinevallam upma edupu moham petti. eppudu siddhu, bava em tiffin cheyyanu anagane upma antaru. vallamohana upma padesi nenu cornflakes mannu mashanam thintunna

Ajay :) said...

Telugu lo naaku nachani oke okka name "Kranthi"

Ajay :) said...

Telugu lo naaku nachani oke okka name "Kranthi"

chavera said...

vivahayaya blogg nas'aya-- ante kadamma--too sad

క్రాంతి said...

@చవెరా గారు
అబ్బే అలాంటిదేమి లేదండి.ఎప్పటికప్పుడు కొత్త బ్లాగులు రాసి మిమ్మల్నందరిని సతాయిస్తాను :).నన్ను ఆశీర్వదించండి మరి!!

Unknown said...

క్రాంతి గారు,
మొదటి సారి మీ బ్లాగు ఈ రోజే చూసాను చాలా నవ్వించ్చేసారు మీ ఉప్మా తో. చాలా మంచి టపా రసారు.
మీ లానే నాకూ ఉప్మా అన్నా కరివేపాకు అన్నా పడి చావదు.మా అమ్మ ఎప్పుడూ అంటుంది కరివేపాకు అంటే పడని వాళ్ళు నీలా ఎవరూ ఉండరు అని.అబ్బా నాకు ఇప్పుడు మీరు తోడు దొరికేసారు. ఇప్పుదు మా అమ్మకి సంతోషంగా మిమ్మల్ని చూపించేస్తాను ఇచ్చెంకా.

Unknown said...
This comment has been removed by the author.
మనోహర్ చెనికల said...

నాది చాలా చిత్రమైన పరిస్ధితి. ఎందుకంటే నాది ఉప్మా మీద కండిషనల్ లవ్.తెలియాలంటే
మిమ్మల్నందరినీ అనంతపురం JNTU కి తీసుకువెళ్ళి ఒక నెల రోజులు అక్కడ హాస్టల్లో వదిలేసి రావాలి. బకెట్లు బకెట్లు చట్నీ, డేగిశాలు డేగిశాలు ఉప్మా. తినకేం చేస్తారు చెప్పండి. అక్కడ అలవాటై ఉప్మా లోకి చట్నీ చేస్తే కానీ తిననంటే మా వదిన పీకిన క్లాస్ ఇంకా మర్చిపోలేదు నేను.

Unknown said...

Upma cheyadam oka art. most moms don't know it. probably your mom too!sorry to say that but that is true.
Moms treat upma as something in which anything can be dumped and within 2mins it gets cooked by itself!
my mom makes the best upma in the world. we love it!btw i don't prefer to eat upma in marriages and hotels. they are made with different intentions.

sai krishna said...

kranti garu tiruguleni upma vyatireka sangam pedadam andi.. nenu kuda membership katti join avtanu..

Anonymous said...

నాకూ ఉప్మా నచ్చదు...కారణం 'hostel ఉప్మా'....కాని అస్సాం లో తిండి తిన్నాక..ఉప్మా కన్నా చెత్త వంటలు ఈ భూమి మీద ఇంకా ఉన్నాయని గ్రహించి....ఇప్పుడు 'ఇంట్లో ఉప్మా'ని అపురూపంగా తింటున్నాను.

swey said...

miru super andi.... mi blogs kuda....:)

Haritha said...

నాకు కూడా ఉప్మా నచ్చేది కాదండీ. హాస్టల్ లో రెండు సం||లు ఉన్నాక ఇంట్లో ఏం చేసినా లొట్టలేసుకుని తినేస్తున్నా. చివరికి నాకు ఒకప్పుడు నచ్చని కూరలు కూడా. హాస్టల్ తిండి కంటే ఇంట్లో చేసిన ఉప్మా 100 రెట్లు నయం!!!