Thursday, October 16, 2008

బ్లాగు ప్రయాణంలో నేను - క్రాంతిఒకరోజు గూగుల్ లో దేనికోసమో వెతుకుతూ ఉంటే అనుకోకుండా శోధన్ సుధాకర్ గారి బ్లాగు చూసాను.ఒక రెండు గంటలు ఆయన బ్లాగులోని టపాలన్ని చదివాను."చాలా బాగా రాసారే!" అని అనుకున్నాను.(కాని ఎందుకో ఆయన ఈమధ్య రాయటం లేదు).తరవాత ఆయన బ్లాగులో కామెంట్లు రాసిన రాధిక గారి బ్లాగు,ప్రవీణ్ గార్లపాటి గారి బ్లాగు చూడటం జరిగింది.ఇంతకు మునుపు నాకు కవితలన్నా,కవులన్నా చాలా చిరాకొచ్చేది.నాకు ఎదురయిన సంఘటనలు అలాంటివి మరి!కాని రాధిక గారి బ్లాగు చూసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను.చిన్న చిన్న పదాలతో మనసుకు హత్తుకునే అర్ధవంతమయిన కవితలెన్నో చదివాను నేను ఈబ్లాగులో.ఇక ప్రవీణ్ రాసే టెక్నికల్ టపాలు కూడ క్రమం తప్పకుండా చదివేదాన్ని.
కొన్నాళ్ళకి నేను ఎలా తయారయ్యానంటే శని,ఆదివారాల్లో కూడా నేను ఈమూడు బ్లాగులతోనే గడిపేసేదాన్ని(అప్పటికింకా నాకు కూడలి గురించి తెలియదు నాకు).అప్పుడే నాకు నేను కూడ తెలుగులో రాయాలనే దుర్భుద్ధి పుట్టింది.అలా నేను బ్లాగు ప్రారంభించడానికి వీరు ముగ్గురు నాకు inspiration.మెదట్లో రాయడానికి చాలా కష్టపడ్డాను.అప్పుడు నాబ్లాగుకి సోలో రీడర్ మా అక్కే! పాపం నా టపాల మీద తన అభిప్రాయాన్ని నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో చెప్పేది.ఒకరోజు ప్రవీణ్ బ్లాగులో అన్ని బొత్తాముల మీద నొక్కుతుంటే నాకు కూడలి గురించి తెలిసి నా బ్లాగుని కూడ జత చెయ్యడం జరిగింది.అలా నా బ్లాగు ప్రయాణం మెదలయ్యింది.అప్పట్నుంచి బుర్రలోని ఙ్ఞాపకాలని బ్లాగులో భద్రపరచుకొంటున్నాను.

9 comments:

ప్రపుల్ల చంద్ర said...

నాకు కూడా అంతే, కవితలు అస్సలు ఇష్టం ఉండేవి కావు, రాధిక గారి బ్లాగ్ చూసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. మొదటిసారి అన్ని టపాలు ఒక్కసారే చదివింది మీ బ్లాగ్లోనే !!!! ఇలాగే ఎప్పటికీ నవ్విస్తూ ఉండండి.

Kathi Mahesh Kumar said...

మీరూ బ్లాగుల్లో ఒక సంచలనాన్ని సృష్టించినవారే..ఇలా పున:శ్చరణ చేసుకోవడం చాలా బాగుంది. అభినందనలు.

కవితల విషయంలో మీ అభిప్రాయమే చాలా మందికి ఉంటుందనుకుంటాను. రాధిక భావుకత్వం,బొల్లోజు బాబాగారి రేంజ్ ఈ రెండూ నాకుకూడా కవితలు చదవటంలో కోల్పోయిన ఆసక్తిని కలిగించాయి. పనిలోపనిగా నేనూ కొన్ని కవితల్ని గెలకడానికి ప్రేరణయ్యాయి.

సిరిసిరిమువ్వ said...

మీ టపాలు మంచి రిలీఫ్. తెలుగు మహిళా హాస్య బ్లాగులలో మీది మొదటిదిగా చెప్పుకోవచ్చు. కాస్త అప్పుడప్పుడయినా అప్పుడు ఏం జరిగిందో చెపుతుండండి.

వేణూశ్రీకాంత్ said...

బాగుందండీ మీ ప్రయాణం, హాస్యానికి చిరునామా మీ బ్లాగ్ అప్పుడపుడూ రిలాక్సేషన్ కోసం మీ పాత టపాలు మళ్ళీ చదువుతూ ఉంటాను.

జ్యోతి said...

క్రాంతి నిజంగా నీ టపాలన్నీ వెరయిటీగా ఉంటాయి. ఉప్మా , అమృతాంజనం అనగానే నువ్వే గుర్తొస్తావు అందరికీ. బ్లాగు మొదలు పెట్తడం మాత్రమే రాసావు.మిగతా విశేషాలు కూడా రాసేయ్

సుజాత వేల్పూరి said...

బాగుంది క్రాంతీ మీ ప్రయాణం! కాస్త తరచు గా ప్రయాణాలు పెట్టుకుంటే బాగుంటుందిగా!

కొత్త పాళీ said...

ఈ "జరుగుడు" పురాణం ఏంటండీ బాబు. మనసులోంచి రాకుండా బలవంతంగా రాయాల్సి వస్తే ఇలాగే "జౌరుగుతంది" కాబోలు.

మాలతి said...

బాగుంది. ఇంకా మంచి బ్లాగులు రాసుకుంటూ పోతారని ఆశిస్తూ

రాధిక said...

సింపుల్ గా చెప్పారు.మీ టపాలకి మీ అక్క కామెంట్లు చూస్తే భలే ముచ్చటేసేది.అందులోనూ మీరు అక్కతో తగాదాలు అవి రాస్తూ వుండేవారు.భలె బాగుండేవి.అప్పుడేమో సోలో రీడర్ అన్నారు గానీ ఇప్పుడు మీ బ్లాగు కేక పెట్టిస్తుంది హాస్యం లో.
అమ్మో నేనే ఇన్స్పిరేషనే.....గాల్లో తేలిపోతున్నాను బాబోయ్..