Thursday, February 12, 2009

హమార బజాజ్

ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ కలిపి కట్టాలి అని ఇందిరత్త అమ్మకి డైరెక్షన్స్ ఇస్తుంది.బయటకెళ్ళి కళ్ళు నులుముకొని చూస్తే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బజాజ్ కబ్ స్కూటర్ వరండాలో కనిపించింది.అమ్మని అడిగాను ఎవరిది ఈ స్కూటర్ అని?ఎవరిదో అయితే మన వరండాలో ఎందుకు ఉంటుందే పిచ్చి మొహమా! మనదే.నాన్న ఈరోజే గోదావరిఖని వెళ్ళి కొనుక్కొచ్చారు అని స్కూటర్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టడంలో బిజి అయిపోంది.ఎందుకో ఆ స్కూటర్ మాదే అంటే నమ్మబుధ్ధి కాలేదు నాకు చాలాసేపటివరకు.అప్పట్లో మా కాలనీలో చాలామందికి లూనాలు ఉండేవి.ఒకరిద్దరికి మాత్రం స్కూటర్ ఉండేది.అప్పట్లో అసలు లూనా ఉండటమే గొప్ప.ఇక స్కూటర్ ఉందంటే అబ్బో ఇహ వాళ్ళ గురించి చెప్పనే అఖ్ఖర్లేదు.

మొదటిసారి స్కూటర్ మీద బయటికెళ్ళినప్పుడు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానో!మా నాన్న నన్ను ఎత్తుకొని ముందుసీటుకి,హ్యాండిల్ కి మధ్య ఉన్న కాసింత స్థలంలో నిల్చోబెట్టి హ్యాండిల్ మీద రెండు చేతులు పెట్టించి గట్టిగా పట్టుకోవాలి అని చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసారు.అలా వెళ్ళేటప్పుడు నాకు రోడ్డు కనిపిందలేదు,అప్పుడు నేనింకా బుడంకాయనన్నమాట.మానాన్న చేతి సందుల్లోంచి అటుఇటు రోడ్డుమీద ఉన్నవాళ్ళకి చేతులూపి తెగ సంబరపడిపోయాను.మావీధిలో ఆచివర్నుండి ఈచివరికి తిప్పి ఇంటికి తీసుకొచ్చారు.స్కూటర్ దిగింతరవాత కూడ ఎక్కడో తేలిపోతున్న అనుభూతి.ఓహ్! స్కూటర్ మీద వెళ్తే ఇంత మజాగా ఉంటుందా అని అనుకున్నాను.

ఇక అప్పట్నుంచి మా నాన్న అప్పుడప్పుడు నన్ను స్కూటర్ మీద బజార్ కి తీసుకెళ్ళేవాళ్ళు,స్కూల్ లో దింపేవాళ్ళు,వర్షం పడుతున్నప్పుడు వరండాలో ఉన్న స్కూటర్ పైన కూర్చొని వర్షం చినుకులతో ఆడుకోవడం,ఎంత ఆటలో మునిగిపోయి ఉన్నాకాని వీధి చివర్లో మానాన్న స్కూటర్ కనిపించగానే నేను పరిగెత్తుకొని ఎదురెళ్ళి అక్కడ్నుండి స్కూటర్ ఎక్కి ఇంటికి రావటం ఇవన్ని ఇంకా నిన్నమొన్న జరిగినట్టే నాకళ్ళ ముందు కదలాడుతున్నాయి.అసలు ఆ స్కూటర్ మీద నేను ఎన్ని రకాల ఆటలు ఆడానో!కొన్నాళ్ళకి మానాన్న కొలీగ్ వాళ్ళబ్బాయి,నవీన్ గాడు మా స్కూటర్ సీట్లన్ని బ్లేడుతో ఇష్టమొచ్చినట్టు కోసిపడేసాడు.మానాన్న చాలా భాదపడ్డారు.నాకయితే వాడిమీద పీకలదాక కోపమొచ్చింది.సీట్లు మార్పించాలంటే బోలెడంత ఖర్చు!అప్పట్లో అన్నింటికి పంచవర్ష ప్రణాళికలు రూపొందింపబడేవి కదా!కాని అలా వదిలేస్తే చూడటానికి బాగోలేదు.అప్పుడు మాఅమ్మ నల్ల సెల్లో టేప్ తెచ్చి ఎక్కడా చిరుగులు కనిపించకుండా అతికించింది.ఆ తరవాత చాలారోజులకి సీట్లు మార్పించారు.

నేను పదోతరగతికి వచ్చేసరికల్లా నాకు స్కూటర్ వెనక సీట్ కి ప్రమోషన్ వచ్చింది.అప్పట్లో మాకాలనీలో చాలానే స్కూటర్లు కనిపించేవి.కాకపోతే బజాజ్ కబ్ లు తక్కువే! ఎందుకంటే కబ్ చాలా బరువుంటుందంట.ఎక్కువమంది చేతక్,LML వెస్పా నడిపేవారు.ఇక ఇప్పుడంటారా, అన్ని స్ప్లెండర్లు పల్సర్లే కదా!అసలిప్పుడు రోడ్లమీద స్కూటర్ కనిపించడం చాలా అరుదు.మానాన్నతో పాటు స్కూటర్లు కొన్నవాళ్ళంతా ఎప్పుడో వాటిని అమ్మేసి మోటర్ సైకిళ్ళని కొనుక్కున్నారు.మానాన్న మాత్రం ఇంకా ఆ స్కూటర్ నే నడిపిస్తున్నారు.ట్రాన్స్ ఫర్ అయిన ప్రతిచోటికి స్కూటర్ ని కూడ తీసుకొని వెళ్తారు.ఎండయినా,వానయినా దాని మీదే ఆఫీసుకెళ్తారు.మొన్నామధ్య మాటల సందర్భంగా నాన్నని "మీతోపాటు కొన్న వాళ్ళందరి స్కూటర్లు తుక్కు తుక్కు అయిపోయి మెకానిక్ షెడ్డులు చేరాయి,మరి మీ స్కూటరేమో ఇంకా ఆరోగ్యంగా ఉంది.ఏంటి రహస్యం" అని అడిగాను.దానికి నాన్న ఒక చిరునవ్వు నవ్వి "నాకు బావమరుదులు కాని,కొడుకులు కాని లేకపోవటమే!" అని అన్నారు.ఆమాటలు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది నాకు.

ఇప్పుడు కార్లయినా,మోటర్ సైకిళ్ళయినా లోన్లమీద కొనెయ్యటం,కొత్త మోజు పోయేవరకు లేదా బోరుకొట్టేవరకు వాడటం తరవాత మార్కెట్ లో వచ్చిన ఇంకో మోడల్ బండి కొనేసి ఉన్న బండిని అమ్మేయడం, అన్ని చకచకా జరిగిపోతున్నాయి.మహా అంటే పదేళ్ళకి మించి ఎవ్వరు వాడటం లేదు.మానాన్న లాంటి కొందరు మాత్రమే ఇలా ఒకే బండిని సంవత్సరాలు సంవత్సరాలు వాడుతుంటారు.ఇది అమ్మేసి కొత్త బండి కొనుక్కోడి నాన్న అంటే అది కేవలం స్కూటర్ అయితే అమ్మేసేవాడ్నే కాని అందులో నా ఇరవయ్యేళ్ళ జీవితం ఉంది.బుడిబుడి నడకల నా పిల్లల ఆటలు,వాళ్ళ సరదాలు ఇంకా ఆ స్కూటర్ మీద నాకు కనిపిస్తున్నాయి.నా జ్ఞాపకాల్ని నేను అమ్మలేను అని చెప్పారు.ఇప్పటికి ఇంటికెళ్తే వరండాలోనే ఎదురొచ్చి పలకరిస్తుంది మా నాన్న స్కూటర్.కాదు కాదు హమార బజాజ్!

28 comments:

అసంఖ్య said...

మీ "హమార బజాజ్ .." టపా
బ్లాగ్ కి ధడ్కన్
మీ శైలె అద్భుతంగా ఉంది. చాలా బాగా రాసారు.

పరిమళం said...

:) :)

కొత్త పాళీ said...

welcome back.

మీ హయాం వచ్చేసరికి బజాజ్ లు పుట్టుకొచ్చాయి, కానీ ఇండియాకి వొరిజినల్ స్కూటర్ ద వన్ అండోన్లీ లాంబ్రెట్టా

kalpana said...

test

kalpana said...

hi krantigaru..naku first comment rayaraledu..anduke test comment rasa......
eesari india ki vachinappudu kuda nanna ni scooter mieeda round veyyamani adugu

kalpana said...

narration bavundi..chinnapaapa story cheptunnattu anipinchindi..

Anil Dasari said...

చిరకాల దర్శనం. అమెరికాకి అలవాటు పడేశారా?

మా వెస్పా (అంటే ఎల్.ఎమ్.ఎల్. వెస్పా కాదు, ఇటలీ నుండి షిప్పులో వచ్చిన అసలు సిసలు పియాజ్జియో వెస్పా) వయసు రమారమి నలభయ్యైదేళ్లు. మా అన్నయ్యకన్నా పెద్దన్నమాట. నాకు 'పెద్దన్న'గా చమత్కరిస్తుంటాను. ఇప్పటికీ లీటర్ పెట్రోలు పోస్తే పాతిక కిలోమీటర్లొస్తుంది. కొన్న కొత్తలో అది మా ఊరికే మొట్టమొదటి స్కూటరట. నేను నడిపిన మొదటి మోటారు వాహనం. ఆ తర్వాత మా ఇంట్లోకెన్ని బండ్లొచ్చి పోయినా, ఆ వెస్పా మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది.

అమెరికా వచ్చాక, శాన్ ఫ్రాన్సిస్కోలో అచ్చు మా వెస్పా లాంటి వెస్పాలే విరివిగా కనిపిస్తుంటే చూసి ఆనందరభరితుడ్నైపోయా. రోజుకో సారన్నా కనిపిస్తుంటాడిక్కడ మా పెద్దన్న :-)

మీ జ్ఞాపకాలు పంచుకుని నావి తట్టిలేపారు. ధన్యవాదాలు.

Kamaraju Kusumanchi said...

Very nice post!

Unknown said...

మీది బజాజ్, మాది ప్రియా అంతే తేడా :)
నాన్న కారు కొనుక్కున్నా ఇంకా ప్రియాని వాడుతూనే ఉంటారు.

పేరు చెప్తే గుర్తుపట్టేంత గొప్పవాడిని కాను said...

hi karnthi garu.....mee tapa chala bagundandi.....ala sagipoindi....anthalone inthena appude ayipoinda anipinchindi...meeku hats off

Viswanath said...

chinna thanam

maa vespa
AP5 6464

first Gear vesi clunch vadhilesi kindha padda roju

anni Gurthochaayi...Baaga raasarandi

Masthan said...

Hamara Calibar

chavera said...

well,
It was a nostalgic trip down the meory line.
Kranthi lanti ma ammayi( deepthi) mundu niluchukoni THANE SCOOTER NADIPINATTU FEEL AYYEDI.na bajaj inka appudappudu tholuthu untanu, Pillalu lerippudu( rekkalochi egiri poyaru)
p.s.Hamara bajaj PRODUCTION Pune lono factory lo aapesaruga!

సోదరి said...

అద్భుతంగా చాలా బాగా రాసారు.

sivaprasad said...

"మీతోపాటు కొన్న వాళ్ళందరి స్కూటర్లు తుక్కు తుక్కు అయిపోయి మెకానిక్ షెడ్డులు చేరాయి,మరి మీ స్కూటరేమో ఇంకా ఆరోగ్యంగా ఉంది.ఏంటి రహస్యం" అని అడిగాను.దానికి నాన్న ఒక చిరునవ్వు నవ్వి "నాకు బావమరుదులు కాని,కొడుకులు కాని లేకపోవటమే!" అని అన్నారు.ఆమాటలు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది నాకు.

chala bagundi

మనోహర్ చెనికల said...

మీది బజాజ్ తో అనుబంధం అయితే నాది, మా నాన్నగారి హీరో సైకిల్ తో. నేను పుట్టకముందు మా నాన్న గారు విజయవాడలో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కొన్నారంట(సుమారు 1983 కి ముందు) అప్పటినుండి ఇంట్లోనే ఉంది. వారానికోసారి క్లీన్ చేయించేవారు. మా సైకిల్లన్నీ పాడైపోయి అమ్మేసారు కానీ మా నాన్న గారు మాత్రం ఇంకా ఆ సైకిల్ ని ఇంట్లోనే ఉంచారు. ఇప్పుడు స్కూటీ కొన్నారు కానీ అప్పుడప్పుడు సైకిల్ మీదే వెళ్తుంటారు.

Vinay Chakravarthi.Gogineni said...

chaala bagundi.............keepitup.....chala chala baagundi..............

chavera said...

ippudu emi kavadam ledu chepma, amma chese upma kuda ledu, corn flakes with milk kante upma ne better kada!

అనిర్విన్ said...

Kranthi garu, whats wrong with you? never write anything on your blog??

Phani said...

naku naa autograph sweet memories movie choosinattu undi

Unknown said...

Hi Kranti....mee blog superb..chala baaga baaga rasaru...chala manchi telugu....assalu..mana acha telugu 'vetakaram' antha kanipstundimee ratallo...chala sarlu navvukunna kuda..
6 months back..oka roju sudden ga net lo tagilindi ee blog..mee writings anni okka roju lone chadivanu. chala baaga rasaru andi.
naaku maa village n friends..chinnappati sangatulu..anni ala gurtukochayi

appati nundi gurtu vachinappudalla open chesi chustunta..kaani emi kotta posts vundatam ledu..

mee sense of humour n timing chala baguntundi..plz. do keep it up...future lo kuda...meeru entha busy ayina work,kids,family toh entha busy ga vunna...people who know u well are really lucky..free time vunnappudu ala blogs lo kuda share cheyyandi...chadivev vallu kadu happy ga vuntaru !!!

engg. bore...tarwata chesina 2 yrs job bore..mba bore..ippati job (1 yr) nundi bore...roju office lo english/hindi lo matladi bore..kaani bratuku teruvu ki tappadu...kaani eppudo manchi movie chusinappudu esp. telugu movie..ila 'mee' lanti manchi 'mana' telugu chadivinappudu...close friends toh manchi ga time spend chesinappudu matrame nijamaina happiness ekkada vuntado artham avutuntadi...

mee 'telugu' chala bagundi andi...chala saradaga vundi...

sry..maree ekkuva bore kottiste...

actually, this is second or third time I'm writing a comment since I've started using internet 10 years ago i.e during my 1st year engg...

I've not exaggerated anything in any of my lines written above...

all the best...
keep smiling...
bye
sathish

q1a2z3q1w2e34rj said...

హాయ్ నా పేరు శివ
మాది రాజమండ్రి దగ్గరా .... నేను మీరు రాసిన ఈ హమారా బజాజ్ చదివాను..బాగా రాసారు .. అసలు విషయం ఏమిటంటే ..బ్లాగ్స్ ఉంటాయి అని తెలుసు కానీ .. తేలుగు లో ఇంత మంచి బ్లాగ్స్ ఉంటాయి అని నాకు తెలియదు...నేను సరదాగా తేలుగు అని గూగల్ లో టైపు చేస్తే ...అది కూడా
(వేరే ఉదేస్యంతో) శోధన అనే సుదాకర్ గారి బ్లాగ్ కనపడింది....ఆయనా రాసిన దాని బట్టి ముందుగా మీ బ్లాగ్ ఓపెన్ చేసా...దాని తరువాత నాకు అనిపిన్చింది అబ్బా మనా తెలుగులో ఇంత మంచి బ్లాగ్స్ ఉంటావా.. అసలు బ్లాగ్స్ అనే వాటిని ఇంత అందముగా .. మనా అనుబావాలను రాసుకోవచ్చ అని పిన్చింది....

Masthan said...

Kranthi garu ippudem jarugutundi.....

గిరీష్ said...

Nice one..Bagundi..Sentiments nachay

--Girish

srujana said...

hi kranthi garu..
"hamara bajaj"..ma nanna kuuda ippatiki bajaj coper sulfate blue dhe vaaduthunnadandi..memu ma nanna ni bike konamante same dailouge naku emanna kodukulu unnaraa..ani..danitho ma anubhandham 20yrs..na chinnapati rojulani gurthu chesaru..

తులసిరామ్ said...

meru malli blogs rayadum modalu pedithe baaguntunthi. i love ur blogs

Anonymous said...

:)

Anonymous said...

privet vse super